
రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు వర్చువల్‌గా హాజరు కాగా, నాగోల్ సీఐ స్వయంగా హాజరయ్యారు. భూమి సమస్యను పరిషరించడానికి పోలీస్‌స్టేషన్‌ను సెటిల్మెంట్ అడ్డాగా మార్చారని హైకోర్టు తప్పుపట్టింది. నాగోల్ పోలీసులు స్థల యజమానిని ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చింది. గత నెల 19న ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటలవరకు పోలీస్‌స్టేషన్‌లోని సీసీ ఫుటేజీ సమర్పించాలని ఆదేశించింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
తాను ఒకసారి సాధారణ పౌరుడిగా పోలీస్‌స్టేషన్‌కు వెళితే ఒక పోలీస్ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించారని జస్టిస్ వినోద్‌కుమార్ తెలిపారు. తాను హైకోర్టు న్యాయమూర్తినని తెలిసిన తర్వాత ఎక్కడలేని మర్యాద చూపారని తెలిపారు. మరోసారి అధికార వాహనంలో తాను వెళ్తుంటే రోడ్డుపై ఒక పోలీస్ ఓ పౌరుడిని కొట్టడం చూసిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు.
పోలీసుల వ్యవహారశైలిపై తనకే ఇలాంటి అనుభవాలు ఉన్నాయంటే సామాన్య ప్రజలకు ఇంకెన్ని బాధలు ఉంటాయో అర్థం చేసుకోవాలని చెప్పారు. “సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దని చెప్పినప్పటికీ పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారు. జనం పోలీస్‌స్టేషన్ మెట్లు ఎకాలంటేనే భయపడుతున్నారు. జనాన్ని కొట్టే అధికారం పోలీసులకు ఎకడిది? చట్టాలు, నిబంధనలు తెలియకుండానే కొందరు పోలీసులు అధికార దర్పంతో విర్రవీగుతున్నారు” అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
అంతకుముందు జరిగిన విచారణ సందర్భంగా సివిల్ వివాదాల్ల జోక్యం చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కేసుల దర్యాప్తును కోర్టులు అడ్డుకోవని, దర్యాప్తు పేరుతో పోలీస్స్టేషన్లను సెటిల్మెంట్లకు అడ్డాలుగా మార్చడానికి వీల్లేదని స్పష్టంచేసింది. రాష్ట్రంలో పోలీసింగ్ సాట్లాండ్ పోలీసులతో పోల్చుకుంటామని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. సెటిల్మెంట్లు చేసిన వాళ్లపై చర్యలు తీసుకుని ఇతరులకు సందేశం ఇవ్వాలని రాచకొండ కమిషనర్‌కు సూచించింది.
More Stories
ఎల్టీటీఈ పునరుద్ధరణకు శ్రీలంక మహిళ ప్రయత్నం
పదేళ్లలో మూడింతలకు పైగా పెరిగిన రాష్ట్రాల అప్పులు
డ్రగ్స్ రహిత సమాజం కోసం బిజెపి 3కె రన్