
విజయవాడ ఇంద్రకీలాద్రిని రూ.100 కోట్లతో పూర్తిగా అభివృద్ధి చేసేందుకు విజన్ 2029లో భాగంగా బృహత్తర ప్రణాళిక సిద్ధమైంది. ప్రధానంగా భక్తుల సౌకర్యాలే కేంద్రంగా ఆలయాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ప్రస్తుతం సరైన మార్గం లేదు. ఇంకా పార్కింగ్ సమస్యలు, కాటేజీల కొరత సహా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
వీటన్నింటినీ పరిష్కరించడమే లక్ష్యంగా బృహత్తర ప్రణాళిక వేశారు. కేంద్రం ప్రసాద్ పథకం కింద నిధులు మంజూరు చేయించేందుకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని చాలాసార్లు ప్రతిపాదనలు ఇచ్చారు. కేంద్ర మంత్రిని సైతం కలిసి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే సుజనాచౌదరి ఆధ్వర్యంలో ఈ బృహత్తర ప్రణాళికను తయారు చేశారు. భక్తులకు స్వచ్ఛ నీటిని అందించేందుకు వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, పర్యావరణ సహిత విద్యుత్తు కోసం సోలార్ ప్లాంట్ల ఏర్పాటు చేశారు.
అలానే వ్యర్థాల నిర్వహణకు వేస్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, భద్రతా వ్యవస్థ పటిష్ట పరిచేలా అధునాతన సీసీటీవీ కెమెరాలతో అనుసంధాన వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇంకా ఆలయ పరిసరాలన్నీ పచ్చదనంతో నింపేలా ప్రత్యేకంగా పార్కులు, నీటి ఫౌంటెయిన్లతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ పనులన్నీ 2029 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇంద్రకీలాద్రి మొత్తాన్ని త్రీడీ రూపంలో ఓ నమూనాగా రూపొందించారు. రహదారులు, ఘాట్‌రోడ్డు, భవనాలు ఇలా అన్నింటినీ ఆవిష్కరించారు.
ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలున్నాయనేది గుర్తించారు. ప్రధానంగా పార్కింగ్ సహా ఏఏ సమస్యను ఎలా పరిష్కరించాలనే దానికి వేర్వేరుగా 5 ప్రాజెక్టులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దుర్గగుడికి ఏటా కోటిన్నర మందికి పైగా భక్తులొస్తుండగా కనీసం ఓ 100 గదులు కూడా వారు బస చేసేందుకు లేవు. కాటేజీల ఏర్పాటుపై దశాబ్దాలుగా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తాజాగా మాస్టర్‌ప్లాన్‌లో 6 ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు.
More Stories
భారతీ సిమెంట్స్ లీజుల రద్దుకు రంగం సిద్ధం
విజయవాడ- సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్