ఏపీలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి, ఎంపీ పాకా సత్యనారాయణ, తెలంగాణ బీజేపీ ఎన్నికల అధికారిగా ఎంపీ కె లక్ష్మణ్ వ్యవహరించనున్నారు. ఈమేరకు మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. హైదరాబాద్‌లో కె. లక్ష్మణ్, విజయవాడలో పాకా సత్యనారాయణ మాట్లాడుతూ ‘అంతర్గత ప్రజాస్వామ్యం పాటిస్తున్న ఏకైక పార్టీ బీజేపీ.అని చెప్పారు.
సోమవారం అధ్యక్ష ఎన్నిక నోటిఫికేషన్ జారీ అవుతుంది. 30న ఉదయం 11 నుంచి 1గంట వరకూ నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. 30వ తేదీన మధ్యాహ్నం 1 నుంచి 2 వరకూ నామినేషన్ల స్క్రూటిని నిర్వహిస్తారు. సాయంత్రం 4గంటల లోపు ఉపసంహరణకు గడువు. జులై 1వ తేదీన అధ్యక్ష ప్రకటన, బాధ్యతల స్వీకరణ ఉంటుందని వారు చెప్పారు. కాగా, ప్రస్తుతం ఏపీలో దగ్గుబాటి పురందేశ్వరి, తెలంగాణలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అధ్యక్షులుగా ఉన్నారు.

More Stories
సంస్కార భారతి తెలంగాణ ఆధ్వర్యంలో వందేమాతరం “ఆర్ట్ ఎగ్జిబిషన్”
మ్యూచువల్ ఫండ్స్ లో తెలుగు ప్రజలు 2.95 లక్షల కోట్ల పెట్టుబడి
వాయుగుండంగా అల్పపీడనం.. తెలంగాణాలో మూడు రోజుల్లో భారీ వర్షాలు