జులై 1న ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుల ఎన్నిక

జులై 1న ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుల ఎన్నిక
రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. రెండు రాష్ట్రాలకు ఒకే రోజు బీజేపీ అధిష్ఠానం అధ్యక్షులను ప్రకటించనుంది. ఈ మేర‌కు ఇరు రాష్రాల్లోని అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. మూడు రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని పార్టీ హైక‌మాండ్‌ నిర్ణయించింది. 

ఏపీలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి, ఎంపీ పాకా సత్యనారాయణ, తెలంగాణ బీజేపీ ఎన్నిక‌ల అధికారిగా ఎంపీ కె ల‌క్ష్మ‌ణ్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఈమేర‌కు మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించారు. హైద‌రాబాద్‌లో కె. ల‌క్ష్మ‌ణ్, విజ‌య‌వాడ‌లో పాకా సత్యనారాయణ మాట్లాడుతూ  ‘అంతర్గత ప్రజాస్వామ్యం పాటిస్తున్న ఏకైక పార్టీ బీజేపీ.అని చెప్పారు. 

సోమవారం అధ్యక్ష ఎన్నిక నోటిఫికేషన్ జారీ అవుతుంది. 30న ఉదయం 11 నుంచి 1గంట‌ వరకూ నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. 30వ తేదీన‌ మధ్యాహ్నం 1 నుంచి 2 వరకూ నామినేషన్ల స్క్రూటిని నిర్వహిస్తారు. సాయంత్రం 4గంట‌ల‌ లోపు ఉపసంహరణకు గడువు. జులై 1వ తేదీన అధ్యక్ష ప్రకటన, బాధ్యతల స్వీకరణ ఉంటుందని వారు చెప్పారు. కాగా, ప్రస్తుతం ఏపీలో దగ్గుబాటి పురందేశ్వరి, తెలంగాణలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అధ్యక్షులుగా ఉన్నారు.