
ఆపరేషన్ సిందూర్‌లో ఎస్-400 అద్భుతంగా పనిచేసిందని, పాకిస్థాన్ వైమానిక దళ యుద్ధ విమానాలను, వాయుమార్గాన ముందస్తు హెచ్చరిక విమానాలను ధ్వంసం చేసిందని పేర్కొన్నాయి. 300 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న విమానాలను విజయవంతంగా ఢీకొట్టడం ద్వారా ఒక రకమైన రికార్డును సృష్టించగలిగింది. 2018లో జరిగిన ఒప్పందం ప్రకారం, ఐదు ఎస్-400 స్క్వాడ్రన్‌లలో మరో రెండు స్క్వాడ్రన్‌ల డెలివరీ కోసం భారత్ కూడా వేచి ఉంది.
మొదటి మూడు స్క్వాడ్రన్‌లను ఇప్పటికే స్వీకరించింది. కార్యాచరణలో మోహరించింది. నాలుగో స్క్వాడ్రన్ డెలివరీకి ముందు, రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. దీంతో భారత్ కోసం ఉద్దేశించిన వ్యవస్థలు బహుశా యుద్ధంలో ఉపయోగించి ఉండవచ్చు. రష్యా ఇప్పుడు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మిగిలిన రెండు వ్యవస్థలను డెలివరీ చేస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు, పాకిస్థాన్‌తోపాటు పీవోకేలోని ఉగ్రస్థావరాల లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర పోషించిన సుఖోయ్ జెట్‌లను అప్‌గ్రేడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఈ మేరకు రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలోసోవ్‌తో తాజాగా జరిగిన చర్చల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆ విషయాన్ని ప్రతిపాదించారు. సుఖోయ్-30ఎంకెఐ యుద్ధ విమానాల అప్‌గ్రేడ్, ఎయిర్-టు-ఎయిర్ క్షిపణుల ఉత్పత్తి, ఎస్-400 క్షిపణి వ్యవస్థలపై చర్చించారు. షాంఘై సహకార సంస్థ సమావేశం సందర్భంగా ఇరు దేశాల రక్షణ మంత్రులు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. భారత వైమానిక దళం దాదాపు 260 సుఖోయ్ 30-ఎంకెఐ జెట్‌లను నడుపుతోంది. గత నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో రష్యాకు చెందిన సుఖోయ్ జెట్‌లు కీలకంగా వినియోగించింది.
“ఎస్-400 వ్యవస్థల సరఫరా, సుఖోయ్ ఎంకెఐ అప్‌గ్రేడ్‌లు, కీలకమైన సైనిక హార్డ్‌వేర్‌ను త్వరితగతిన కొనుగోలు చేయడం ఈ సమావేశానికి చెందిన కొన్ని ముఖ్యమైన అంశాలు. రెండు దేశాల నాయకుల మధ్య ఇటీవల జరిగిన అత్యంత ముఖ్యమైన సమావేశాల్లో ఇదొకటి. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో రక్షణ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉంది” అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
More Stories
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు