ఏపీ పర్యాటక బ్రాండ్ అంబాసిడర్​గా బాబా రామ్‌దేవ్‌

ఏపీ పర్యాటక బ్రాండ్ అంబాసిడర్​గా బాబా రామ్‌దేవ్‌
ఏపీ పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్​గా వ్యవహరించడానికి ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఉత్తర భారత్ వాసులకు ఏపీలో ఉన్న పర్యాటక ప్రాంతాలు చాలా తెలియవని, వాటి గురించి పరిచయం చేయాలని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. యోగా ఆయుర్వేద, నేచురోపతి లాంటి అంశాలను పర్యాటక ప్రాంతాల్లో అవసరమని గుర్తు చేశారు.  
 
విజయవాడలో కారవాన్ టూరిజం బస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ పర్యాటక శాఖకు సలహాదారుగా ఉండాలని ముఖ్యమంత్రి కోరుతూ ప్రజలందరూ హెల్తీ, వెల్తీ, హ్యాపీగా ఉండాలన్నదే తన లక్ష్యమని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధి చెందేందుకు అన్ని చర్యలు చేపట్టామని చెబుతూ ఆగస్టు 15 లోగా అన్ని సేవలను ఆన్‌లైన్‌లో అందిస్తామని తెలిపారు.

కాగా, ఏపీలో హార్సిలీ హిల్స్, అరకు, విశాఖ, రాజమహేంద్రమరం, పిచ్చుక లంక, సూర్యలంక లాంటి మంచి ప్రాంతాలు ఉన్నాయని బాబా రామ్‌దేవ్‌ వివరించారు. పారిస్, స్విట్జర్లాండ్, టర్కీ ఇలాంటి దేశాలకు పర్యాటకం కోసం వెళ్తున్నాం కానీ మనదేశంలో మరిన్ని అందాలున్నాయని తెలిపారు. ఏపీలో ఉన్న పర్యాటక విధానం ఎంతో ఆకర్షణీయమని చెప్పారు.

 
అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలో పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధ్యాత్మిక, సాంస్కృతిక వెల్‌నెస్‌ కేంద్రాన్ని నిర్మించనున్నట్లు రాందేవ్‌ బాబా తెలిపారు. గురువారం వివిధ శాఖల అధికారులతో కలిసి హార్సిలీహిల్స్‌ను సందర్శించారు. వెల్‌నెస్‌ కేంద్రం ఏర్పాటుకు అనువైన భవనాలు, భూములను పరిశీలించారు.  
 
అలాగే విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చినరావుపల్లిలో మెసర్స్‌ పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ పేరిట రూ.500 కోట్లతో భారీ భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తామని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం చినరావుపల్లిలో కేటాయించిన భూములను కూడా  ఆయన పరిశీలించారు.
 
దిండి లాంటి ప్రాంతాల్లో వెడ్డింగ్ క్రూయిజ్ లేదా బోట్ లాంటి ప్రాజెక్టు చేపట్టవవచ్చునని అభిప్రాయపడ్డారు. వెడ్డింగ్ డెస్టినేషన్​గా ఈ ప్రాంతాన్ని మార్చాలని ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు. భారతీయ సంప్రదాయం పరంగా వివాహాలు జరిపించేలా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్రాజెక్టు ఉంటుందని వివరించారు. ఏపీలో పతంజలి సంస్థ వెల్ నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని భావిస్తోందని తెలిపారు. హార్సిలీ హిల్స్​ను ప్రపంచ ఐకానిక్ వెల్ నెస్ సెంటర్​గా మారుస్తామని తేల్చిచెప్పారు.