 
                ఇజ్రాయెల్‌లో ఉంటూ స్వదేశానికి తిరిగి రావాలనుకునే భారతీయులను వెనక్కి తెచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) ప్రకటించింది. ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా దాడుల తర్వాత ఇజ్రాయెల్ తమ దేశ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దానితో ముందుగా ఇజ్రాయెల్ నుంచి భూ సరిహద్దుల ద్వారా, తరువాత భారత్‌కు వాయుమార్గం ద్వారా ప్రయాణ సౌకర్యం కలిస్తామని తెలిపింది. విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రతకు భారత్ అధిక ప్రాధాన్యమిస్తుందని తెలిపింది.
భారత్ చేరుకోవాలనుకునే వారు టెల్ అవివ్‌లోని రాయబార కార్యాలయంలో తమ పేర్లు రిజిస్టర్ చేయించుకోవాలని ఎంఈఏ సూచించింది. ఇప్పటికీ రిజిస్టర్ చేయించుకోని వారు అధికారిక పోర్టల్ www.indembassyisrael.gov.in/
మరోవంక, భారత ప్రభుత్వం ఇరాన్ నుంచి భారతీయుల తరలింపు కోసం ఏర్పాటు చేసిన ‘ఆపరేషన్ సింధూర్’ కొనసాగుతోంది. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధులో భాగంగా 311 మంది భారతీయులతో మహాన్ ఎయిర్ ఫ్లైట్ (డబ్ల్యు50071ఏ) సురక్షితంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారంనాడు చేరుకుంది. వీరిలో ఎక్కువమంది ఇరాన్లో చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థులే ఉండగా, ఇందులోనూ 200 మంది వరకూ కశ్మీర్ విద్యార్థులు ఉన్నారు. కాగా, ఇంతవరకు ఇరాన్ నుంచి సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయుల సంఖ్య 1428 మందికి చేరినట్టు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.





More Stories
బీహార్ ఎన్నికల ఎన్డీయే మేనిఫెస్టోలో కోటి ప్రభుత్వ ఉద్యోగాలు
సుప్రీంకోర్టు 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్
ముంబైలో పిల్లలను బందీలుగా తీసుకున్న ఆర్య కాల్చివేత