
కాగా, బీజేపీకి కంచుకోటలా ఉన్న విసావదర్ నియోజకవర్గాన్ని ఆప్ కైవసం చేసుకుంది. ఆప్ అభ్యర్థి గోపాల్ ఇటాలియా 17,554 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు. గోపాల్ ఇలియాకు 75,943 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి కీరిత్ పాటిల్‌కు 58,388 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి నితిన్ రాన్పరయకు కేవలం 5,501 ఓట్లు పోలయ్యాయి.
కేరళలోని నిలాంబర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్యదన్ షౌకత్ 11,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) అభ్యర్థి ఎం.సర్వాజ్పై 11,077 ఓట్ల ఆధిక్యంతో షౌకత్ గెలిచారు. షౌకత్‌కు 77,737 ఓట్లు రాగా, స్వరాజ్ (సీపీఎం)కు 66,660 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి పీవీ అన్వర్‌కు 19,760 ఓట్లు, బీజేపీ అభ్యర్థి అడ్వకేట్ మోహన్ జార్జికి 8,648 ఓట్లు వచ్చాయి.
పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి సంజీవ్ అరోరా 10,637 ఓట్ల ఆధిక్యంతో గెలుపు సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి భరత్ భూషణ్ ఆషుపై ఆయన విజయం సాధించారు. అటు గుజరాత్‌లోని విసావదర్లోనూ ఆప్ అభ్యర్థి గెలవడంతో ఆ పార్టీ సంబరాలు జరుపుకొంటోంది.
More Stories
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్‌గా అర్షదీప్