
మంచు మోహన్ బాబు మంచు విష్ణు నిర్మించి, నటిస్తున్న కన్నప్ప సినిమాపై సెన్సార్ స్క్రూటినీ కూడా కాకుండా, సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా, హైకోర్టులో కౌంటర్ వేయకుండా సినిమా విడుదల తేదీని ఎలా ప్రకటిస్తారని సెన్సార్ బోర్డును ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. త్వరలో కౌంటర్ వేస్తామని సెన్సార్ బోర్డు న్యాయవాది తెలిపారు.
సినిమాపై సనాతన ధర్మాన్ని, హిందూ దేవి దేవతలను, బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు మనోభావాలు దెబ్బ తినే విధంగా చరిత్రను, పురాణాలను, వక్రీకరించి కన్నప్ప సినిమా నిర్మించారని బ్రాహ్మణ చైతన్య రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ ఏపీ హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. అయితే వేసవి సెలవు తర్వాత హైకోర్టు మంగళవారం కన్నప్ప సినిమా కేసు విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా సెంట్రల్ ఫిలిం బోర్డ్ ఆఫ్ సర్టిఫికేషన్ ముంబై తరఫున అడ్వకేట్ హాజరయ్యారు. వాది తరుపున అడ్వకేట్ కన్నప్ప సినిమా సెన్సార్ కాకుండానే గుంటూరులో జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్ని అవరోధాలు అయినా సరే ఈనెల 27న సినిమా రిలీజ్ చేస్తామని తెలియజేసిన అంశంపై పత్రికల్లో వచ్చిన వార్తలని న్యాయస్థానం ముందు ఉంచారు.
మిగిలిన ప్రతివాదులకు నోటీసులు అందినా ఎందుకు హాజరు కాలేదని, కౌంటర్ ఎందుకు వేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. సెన్సార్ అనుమతి లేకుండా సినిమా విడుదల చేస్తే కోర్టు వారు చట్ట ప్రకారం ఏం చేయాలో అదే చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసి ఈనెల 27వ తేదీకి కన్నప్ప కేసును వాయిదా వేశారు. అదే రోజున ప్రపంచవ్యాప్తంగా కన్నప్ప సినిమాను విడుదల చేస్తున్నట్లు మంచు కుటుంబం ప్రకటించడం గమనార్హం.
More Stories
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం బిజెపి థ్యేయం
అన్నమయ్య జిల్లాకు పీఎం ధన ధాన్య కృషి యోజనలో చోటు