
భారత స్టార్ ప్లేయర్ స్మృతి మందాన తాజాగా రిలీజ్ చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకుల జాబితాలో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ గా నిలిచింది. తాజాగా ఐసిసి మహిళల వన్డే ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఆరు సంవత్సరాల తర్వాత మంధాన తిరిగి తన అగ్ర స్థానాన్ని దక్కించుకుంది. 2024 ఏడాదికి గానూ ఐసీసీ ఉమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్‌ది ఇయర్‌గా మంధాన నిలిచింది. గతేడాదిలో 13 మ్యాచ్‌లలో 57.86 సగటుతో 747 పరుగులు చేసింది. అందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి.
ఇటీవల శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లతో జరిగిన వన్డే ట్రై-సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో మంధాన సెంచరీతో చెలరేగింది. కొన్ని మ్యాచ్ లే ఆడినా అద్భుత ఫామ్ తో పరుగులు సాధించింది మంధాన. ఈ క్రమంలోనే ఆమె వన్డేలో మళ్లీ నంబర్ స్థానానికి చేరుకుంది. దక్షిణాఫ్రికా కెప్టెన్ లౌరా వోల్వార్డ్.. ఇటీవల 19 పాయింట్లు కోల్పోయింది. దీంతో స్మృతి టాప్ వన్ నెంబర్ దిశగా దూసుకెళ్లింది. 727 రేటింగ్ పాయింట్లతో స్మృతి మందానా టాప్ ప్లేస్‌లో నిలిచింది.
ఇంగ్లండ్ కెప్టెన్ నటాలీ స్కీవర్ బ్రంట్ 719 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో ఉంది. వోల్వార్డ్ 719 పాయింట్లతో మూడవ స్థానంలో నిలిచింది. మందాన తర్వాత ర్యాంకు లిస్టులో ఉన్న ఇండియన్ బ్యాటర్లలో జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ ఉన్నారు. ఆ ఇద్దరూ 14, 15వ స్థానాల్లో నిలుచున్నారు. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ అమీ జోన్స్ 689 రేటింగ్‌లతో నాల్గవ స్థానం, ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ 684 రేటింగ్‌తో ఐదో స్థానంలో నిలిచారు.
అలాగే, బౌలర్ల ర్యాంకింగ్స్‌లో సోఫీ ఎక్లెస్టోన్ 747 రేటింగ్‌లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఆష్ గార్డ్నర్ (724), మేగాన్ షుట్ (696), దీప్తి శర్మ (672) మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నారు. మారిజాన్ కాప్ నాలుగు స్థానాలు దిగజారి ఐదో స్థానం నుండి తొమ్మిదవ స్థానానికి పడిపోయింది. కిమ్ గార్త్, అలానా కింగ్, కేట్ క్రాస్, హేలీ మాథ్యూస్ ఒక్కొక్కరు ఒక్కో స్థానాన్ని మెరుగుపరుచుకున్నాను.
ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికి వస్తే టాప్ 10లో ఎటువంటి మార్పు లేదు. యాష్ గార్డ్నర్ 470 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. హేలీ మాథ్యూస్ రెండవ స్థానంలో (432), మారిజాన్ కాప్ (391) మూడవ స్థానంలో, దీప్తి శర్మ (353) నాల్గవ స్థానంలో, అమేలియా కెర్ (338) ఐదవ స్థానంలో ఉన్నారు.
More Stories
యాంటిఫా గ్రూపును ఉగ్రసంస్థగా ప్రకటించిన ట్రంప్
రష్యా ఆర్మీలోకి బలవంతంగా భారతీయ యువత
ఆసియా కప్ బాయ్‌కాట్ అంటూ బెట్టు చేసి తోకముడిచిన పాక్