
జాతీయ భద్రతా సలహా బోర్డు (ఎన్ ఎస్ ఎ బి) సభ్యుడిగా డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీశ్‌రెడ్డి నియామకమయ్యారు. రెండు సంవత్సరాల పాటు ఆయన బోర్డు సభ్యుడిగా కొనసాగనున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రా మాజీ చీఫ్ అలోక్ జోషీ నేతృత్వంలోని జాతీయ సలహా బోర్డును ఏర్పాటు చేసింది.
ఈ బోర్డు ప్రధాని నేతృత్వంలోని జాతీయ భద్రతా కౌన్సిల్‌కు పలు సూచనలు చేస్తుంది. జాతీయ భద్రతా సలహా బోర్డును ఇటీవలే పునర్వ్యవస్థీకరించి రా మాజీ చీఫ్ అలోక్ జోషి నేతృత్వంలోని బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డులు ఏడుగురు సభ్యుల్లో ఆరుగురిని ఇప్పటికే కేంద్రం నియనించింది.
ఇందులో మాజీ వెస్ట్రన్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ పీఎం సిన్హా, ఆర్మీ సదరన్ మాజీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్, రియర్ అడ్మిరల్ మోంటీ ఖన్నా, విశ్రాంతి ఐపీఎస్ అధికారులు రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ సింగ్, మాజీ విదేశాంగ శాఖ అధికారి బీ వెంకటేశ్ వర్మను బోర్డు సభ్యులను నియమించింది. తాజాగా రక్షణ రంగ నిపుణుడు, డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీశ్‌రెడ్డికి సైతం చోటు కల్పించింది. ప్రస్తుతం ఆయన ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి