
నూతన మంత్రులకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ ఉపసభాపతిగా రామచంద్రనాయక్కు అవకాశం లభించగా, సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఆ వర్గానికి చెందిన వారినే మంత్రివర్గంలోకి తీసుకున్నారు. తాజాగా పదవులు పొందినవారంతా మొదటిసారి ఎమ్యెలుగా ఎన్నికైన వారు కావడం గమనార్హం.
బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీహరి ముదిరాజ్, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డం వివేక్, మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు అవకాశం దక్కింది. లంబాడా సామాజిక వర్గం నుంచి రామచంద్రు నాయక్‌ను ఉపసభాపతిగా ఎంపిక చేశారు. విస్తరణలో నలుగురికి అవకాశం కల్పించాలని తొలుత భావించారు. సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల పేర్లు మొదటి నుంచీ వినిపించినా, ప్రస్తుతానికి ఎస్సీ, బీసీలకు మాత్రమే అధిష్ఠానం అవకాశం ఇచ్చింది.
అయితే మాదిగ సామాజికవర్గంతో పాటు ఎస్టీల నుంచి కూడా ఒకరికి అవకాశం ఇవ్వాలని నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్‌రెడ్డికి కూడా చోటు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుబట్టినట్లు సమాచారం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇస్తే ఆయన సోదరుడు, మంత్రి వెంకట్ రెడ్డిని కూడా కొనసాగించడం కష్టమని, ఇద్దరిలో ఒకరికి మాత్రమే చోటు కల్పించాల్సి ఉంటుందని అధిష్ఠానం స్పష్టం చేయడంతో ఈ అంశాన్ని ప్రస్తుతానికి పక్కనపెట్టినట్లు తెలిసింది. ప్రస్తుతం ముగ్గురికి అవకాశం కల్పించడంతో మరో 3 స్థానాలు ఖాళీగా ఉంటాయి. వీటితో పాటు చీఫ్ విప్ పదవి భర్తీకి కూడా కసరత్తు సాగుతోంది. బీసీల నుంచి ఆది శ్రీనివాస్ ప్రస్తుతం శాసనసభలో విప్‌గా ఉన్నారు.
More Stories
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్!
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి