
“కాళేశ్వరం ప్రాజెక్టు మంజూరు అంశం ఎప్పుడూ కేబినెట్ ముందుకు రాలేదు. క్యాబినెట్ అప్రూవల్ లభించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తాము సబ్ కమిటీగా ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వలేదు. కాళేశ్వరం డైరెక్ట్‌గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో కార్యరూపం దాల్సింది. మూడేళ్ళ తర్వాత కేవలం సవరించిన అంచనాలు మాత్రమే క్యాబినెట్‌కు ముందుకు వచ్చాయి” అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
మాజీ ఆర్థిక మంత్రి, ప్రస్తుత మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందు తన పేరును ప్రస్తావించడంతో స్పందించినట్లు ఆయన స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టు ఇచ్చిందని, కేబినెట్ ఆమోదించిందంటూ ఈటల రాజేందర్ అబద్ధాలు మాట్లాడారని మంత్రి తుమ్మల ఆరోపించారు.
ముందు మేడిగడ్డ మంజూరు జీవో వచ్చిందని, అది 2016 మార్చి ఒకటో తేదీన జీవో(నెం.231), ఆ తర్వాత పదిహేను రోజుల తర్వాత రీ ఇంజినీరింగ్ జీవో వచ్చిందని మంత్రి వివరించారు. అది 2016 మార్చి 15న సబ్ కమిటీ జీవో (నెం.655) అని, తాను అందులో సభ్యుడిగా ఉన్నానని, అయితే కేబినెట్ సబ్ కమిటీకి, మేడిగడ్డ మంజూరుకు సంబంధం లేదని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుల స్థితిగతుల మీదనే కేబినేట్ సబ్ కమిటీ ఏర్పాటైందని, మధ్యలో మిగిలిపోయిన నాలుగు ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేసుకోవడానికి, వాటి స్థితిగతులు, ఆ ఇంజినీరింగ్ వర్క్ ఏరకంగా ముందుకు తీసుకువెళ్లాలనే దానిపై డిపార్ట్మెంట్ను సంప్రదించి మంత్రివర్గ ఉపసంఘం రిపోర్టు ఇచ్చిందని తెలిపారు. ఆ రిపోర్టు తన వద్ద ఉందని, అందులో కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన అంశాలు ఏవీ లేవని మంత్రి తుమ్మల వివరించారు.
More Stories
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
తెలంగాణ రాజకీయాల్లో శూన్యత .. భర్తీకి బిజెపి సిద్ధం
తెలుగు రాష్ట్రాల్లో లోక్ సత్తాతో సహా 25 పార్టీలపై వేటు