
అదేవిధంగా అక్కడ ఉండేందుకు ఏర్పాటు చేసుకున్న కంటైనర్లకు కూడా నిప్పంటించారు. పెద్ద ధన్వాడ గ్రామ సమీపంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టవద్దని పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడతో పాటు మరికొన్ని గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారు. దాదాపు 3 నెలల పాటు రిలే నిరాహార దీక్షలు కూడా చేశారు. రాజోలి తహశీల్దార్ సమక్షంలో కంపెనీ యాజమాన్యం, గ్రామస్థులతో మీటింగ్ నిర్వహించినపుడు కూడా 12 గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకించారు.
ఆర్డిఓతో పాటు డిఎస్పి కంపెనీ యాజమాన్యం, ఇథనాల్ వ్యతిరేక పోరాట సమితితో గతంలో ఆర్డిఓ కార్యాలయంలో మీటింగ్ నిర్వహించారు. అప్పుడు కూడా ఆయా గ్రామాల ప్రజలంతా ఏకతాటిపై ఉండి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకించారు. దీంతో ఫ్యాక్టరీ నిర్మాణ పనులను కంపెనీ నిలిపివేసింది. అయితే, ఇథనాల్ కంపెనీ యాజమాన్యం మాత్రం సోమవారం అర్ధరాత్రి పనులు ప్రారంభించేందుకు కంటైనర్లు, జెసిబిలు, హిటాచీలు, బొలెరో వాహనాలు, టిప్పర్లు తీసుకొచ్చి ఫ్యాక్టరీ నిర్మాణ స్థలం దగ్గర ఉంచింది.
ఈ విషయం కాస్త 12 గ్రామాల ప్రజలతో పాటు ఫ్యాక్టరీ వ్యతిరేక కమిటీకి తెలియడంతో మంగళవారం రోడ్డెక్కి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బుధవారం ఉదయమే ఆకస్మాత్తుగా అన్ని గ్రామాల ప్రజలంతా ఏకతాటిపై కొచ్చి ఫ్యాక్టరీ నిర్మాణం కోసం తీసుకొచ్చిన సామగ్రిని ధ్వంసం చేశారు. పచ్చని పంట పొలాల మధ్య విషం చిమ్మే ఫ్యాక్టరీ తమకు వద్దంటూ రైతులు, ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టవద్దని చెప్పి దాదాపు రెండేళ్ల నుంచి తాము పోరాటం చేస్తున్నామని, అయినా వినకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం మొండి పట్టుదలకు పోయి తమ గ్రామాలు, పొలాలపైకి విషం చిమ్మాలని చూస్తోందని మండిపడ్డారు. ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే 12 గ్రామాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, పచ్చని పంట పొలాలు బీడువారిపోతాయని, ప్రజలు క్యాన్సర్, తదితర రోగాల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని వాపోయారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తాము ఫ్యాక్టరీ నిర్మాణాన్ని జరగనివ్వబోమని తేల్చిచెప్పారు.
More Stories
మహిళా మోర్చా ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
అమెరికాలో పోలీసు కాల్పుల్లో తెలంగాణ టెక్కీ మృతి!
నిజమైన హైదరాబాద్ బస్తీల్లో ఉంది