
పంజాబ్‌లోని అమృత్‌సర్ మజితా రోడ్ బైపాస్ వద్ద ఖాళీ ప్రదేశంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో అనుమానిత ఖలిస్తానీ ఉగ్రవాది మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన మంగళవారం ఉదయం 9.30 గంటల సమయంలో జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఉగ్రవాదికి రెండు చేతులు విరిగి ముక్కలుగా పడిపోయాయి.
ఈ ఘటనపై డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (సరిహద్దు పరిధి) సతిందర్ సింగ్ మాట్లాడుతూ ‘ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తికి బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బికెఐ) ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని అనుమాలున్నాయి. నిర్జన ప్రదేశంలో ఆ వ్యక్తి తన దగ్గరున్న పేలుడు పదార్థాల్ని తీసే క్రమంలో పేలుడు పదార్థం పేలడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు’ అని తెలిపారు.
ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి రెండు చేతులు ముక్కలు ముక్కలుగా పడిపోయాయి. మృతి చెందిన ఈ వ్యక్తి ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవాడనే విషయం తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తి పలానా అని గుర్తించనప్పటికీ అతని పాకెట్ జేబులో లభించిన కొన్ని కీలక ఆధారాలనుబట్టి అతను ఓ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయని స్పష్టంగా తెలుస్తుంది.
ఇది ఐఇడి (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్) పేలుడునా లేదా గ్రెనేడ్ పేలుడునా అని తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ సైన్స్ బృందం లాబొరేటరీ బృందం దర్యాప్తు చేస్తోంది అని సతిందర్ సింగ్ తెలిపారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో పెద్ద పేలుడు శబ్దం వినిపించడతో భయాందోళనలకు గురయ్యామని స్థానికులు తెలిపారు స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని డిఐజి సతిందర్ సింగ్ విజ్ఞప్తి చేశారు.
More Stories
తీవ్ర వాతావరణంతో ఇద్దరు ఆర్మీ కమాండోలు మృతి
త్వరలో దేశవ్యాప్తంగా ‘సర్’
అయోధ్య సమీపంలో భారీ పేలుడు – ఐదుగురు మృతి