
ప్రపంచవ్యాప్తంగా మళ్లీ మహమ్మారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. చాప కింద నీరులా వ్యాపిస్తోంది. భారత్ లోనూ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఎపిలోని విశాఖపట్నంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. మద్దిలపాలెంకు చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు వైద్యులు. దీంతో ఆమెతో పాటు భర్త, పిల్లలకు ఆర్టీపిసిఆర్ పరీక్షలు చేశారు.
అనంతరం వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. ఇన్నాళ్లకు మళ్లీ రాష్ట్రంలో కరోనా కేసు నమోదు కావడంతో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. బాధితుతల చుట్టుపక్కల వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా, మహారాష్ట్రలో ఇప్పటికే 100కు పైగా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఇద్దరు మరణించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఇటీవల వెల్లడించింది.
రాష్ట్రంలో కరోనా నిబంధనలను పాటించాలని కోరుతూ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ కె పద్మావతి గురువారం విడుదల చేశారు. ప్రజలు గుంపులుగా ఉండొద్దని, ప్రార్థనా సమావేశాలు, సామాజిక సమావేశాలు, పార్టీలు, వంటి సామూహిక సమావేశాలను నిలిపివేయాలని తెలిపారు. రైల్వే స్టేషన్లు, బస్‌స్టాండ్లు, ఎయిర్‌పోర్టులలో కరోనా నిబంధనలు పాటించాలని ఆమె కోరారు.
వృద్ధులు, గర్భిణులు ఇళ్లల్లోనే ఉండాలని, క్రమం తప్పకుండా చేతులను శుభ్రం చేసుకోవాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని పేర్కొన్నారు. కరోనా లక్షణాలుంటే తక్షణం పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఇతర దేశాలనుండి వచ్చిన వ్యక్తులు పరీక్షలు చేయించుకోవాలని వెల్లడించారు. జ్వరం, చలి, దగ్గు అలసట, గొంతు నొప్పి రుచి లేదా వాసన కోల్పోవడం తలనొప్పి వంటి లక్షణాలుంటే నిర్దారణ కోసం సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలని తెలిపారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు