మావోయిస్టు అగ్రనేత హతంపై ప్రధాని, హోంమంత్రి హర్షం

మావోయిస్టు అగ్రనేత హతంపై ప్రధాని, హోంమంత్రి హర్షం

* ఈ ఏడాది ఇప్పటికి 200 మంది నక్సలైట్ల మృతి

ఛత్తీస్‌గఢ్‌ నారాయణపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేశవరావు సహా 27 మందినక్సల్స్‌ని భద్రతా బలగాలు  మట్టుబెట్టడంపై ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా భద్రతా బలగాలను ప్రశంసించారు. న‌క్స‌ల్స్ పై జ‌రుపుతున్న పోరాటంలో ఘ‌న విజ‌యం సాధించ‌మంటూ ప్రధాని మోదీ ట్విట్ చేశారు.

అగ్ర‌నేత‌తో ఇత‌ర న‌క్స‌ల్స్ ను నిర్మూలించ‌డంలో మ‌న ద‌ళాలు చూపుతున్న ధైర్యాన్ని చూసి గ‌ర్విస్తున్నాన‌ని తెలిపారు. దేశఃంలో మావోయిజం ముప్పును స‌మూలంగా నిర్మూలించ‌డానికి, ప్ర‌జ‌ల‌కు శాంతిని అందివ్వ‌డానికి త‌మ ప్ర‌భుత్వ క‌ట్టుబ‌డి ఉంద‌ని ఆయన స్పష్టం చేశారు. ఈ సంద‌ర్బంగా ఆప‌రేష‌న్ క‌గార్ లో పాల్గొన్న భ‌ద్ర‌తా సిబ్బందిని అభినందించారు మోదీ.

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పందిస్తూ నక్సల్స్‌ నిర్మూలన ఇదో మైలురాయి విజయమని పేర్కొన్నారు. సీపీఐ మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి, అగ్ర నేత, నక్సల్ ఉద్యమానికి వెన్నెముకగా నిలిచిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సైతం ఉన్నారని తెలిపా. మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన నేతను దళాలు మట్టుబెట్టడం ఇదే తొలిసారని సోషల్‌ మీడియా పోస్ట్‌లో చెప్పారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలను అభినందించారు. 2026 మార్చి 31లోగా నక్సలిజాన్ని అంతమొందిస్తామని షా స్పష్టం చేశారు.

ఎన్‌కౌంటర్‌పై ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయ్‌ స్పందిస్తూ మార్చి 2026 నాటికి దేశంలో, ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజాన్ని అంతం చేయాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంకల్పాన్ని బలోపేతం చేస్తూ భద్రతా దళాలు నిరంతరం విజయం సాధిస్తున్నాయని, వైపు వేగంగా కదులుతున్నాయని తెలిపారు. క్లిష్ట భౌగోళిక పరిస్థితులు, అనేక సవాళ్లు ఉన్నప్పటికీ వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయాత్మకంగా నారాయణపూర్‌లోని ఛత్తీస్‌గఢ్ పోలీసుల డీఆర్‌జీ యూనిట్‌ పూర్తి నిబద్ధత, దృఢ సంకల్పంతో పూర్తి చేస్తోందని కొనియాడారు. 

నక్సలిజానికి వ్యతిరేకంగా మూడు దశాబ్దాలుగా సాగుతున్న యుద్ధంలో మొట్టమొదటిసారి ప్రధాన కార్యదర్శి ర్యాంకు ఉన్న నాయకుడిని భద్రతా దళాలు అంతం చేశాయని ఎక్స్‌ వేదికగా షా పేర్కొన్నారు. నక్సలిజాన్ని అంతం చేసేందుకు సాగుతున్న యుద్ధంలో నేడు ఓ చారిత్రక విజయాన్ని సాధించినట్లు ఆయన తెలిపారు.

సైనికులు సాధించిన ఈ విజయం ప్రశంసనీయమని, వారి ధైర్యసాహసాలకు తాను సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. ఎన్‌కౌంటర్‌లో అమరుడైన జవాన్‌కు నివాళులర్పించారు. గాయపడ్డ వారంతా వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆపరేషన్‌ బ్లాక్‌ ఫారెస్టు పూర్తయిందని, 54 మంది నక్సలైట్లను అరెస్టు చేయగా 84 మంది నక్సల్స్‌ ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, మహారాష్ట్రలో లొంగిపోయారని హోం మంత్రి వెల్లడించారు. 2026 మార్చి 31వ తేదీ లోపల నక్సలిజాన్ని అంతం చేయాలన్న సంకల్పంతో మోదీ ప్రభుత్వం ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

ఈ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతలు, సెంట్రల్ కమిటీ , పొలిట్‌బ్యూరో సభ్యులు పెద్ద సంఖ్యలో సమావేశం అవుతున్నారని ఇంటలిజెన్స్ సమాచారం అందింది. దీనితో ఈ ప్రాంతంలోకి గుట్టుచప్పుడు కాకుండా పెద్ద ఎత్తున భద్రతా బలగాలను రంగంలోకి దింపారు. వీరికి స్థానిక పోలీసులు సహకరించారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా సైన్యం (పిఎల్‌జిఎ), సీనియర్ మాడ్ డివిజన్ కేడర్ వారు కూడా ఇక్కడనే ఉన్నారని సమాచారం అందింది. దీనితో వీరిని మట్టుపెట్టాలనే పెద్ద ఎత్తున దిగ్బంధానికి దిగారని వెల్లడైంది.

అలాగే ‘అవామ్‌-ఐ-జంగ్‌’ ఎడిటర్‌, 31 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న నేత, మాడ్‌ ఏరియా డివిజన్‌ ప్రెస్‌ యూనిట్‌ సభ్యుడు, దండకారణ్యం స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడు సజ్జా వెంకట నాగేశ్వరరావు అలియాస్‌ రాజన్న అలియాస్‌ యేసన్న అలియాస్‌ నవీన్‌ సైతం మృతి చెందినవారిలో ఉన్నారు.అబూజ్‌మాడ్‌ అడవులను కేంద్రంగా చేసుకున్న మావోయిస్టు పార్టీ కార్యకలాపాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా పావులు కదిపింది. 
 
ఇందులో భాగంగానే నెల రోజుల ‘హైడ్రామా’ అనంతరం మావోయిస్టు పార్టీ అగ్ర నాయకత్వంపై పంజా విసిరింది. అబూజ్‌మాడ్‌ ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు 27 మంది మావోయిస్టుల మృతదేహాలతోపాటు వారికి సంబంధించిన భారీ ఆయుధ, వస్తు సామగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుల్లో ఇంకొందరు ముఖ్య నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మిగతా వారి వివరాలను అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. 
 
సంబాల కేశవరావుపై ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో ఇప్పటికే రూ.5 కోట్లకు పైగానే రివార్డు ఉంది. తాజా ఘటనను కూడా కలుపుకుంటే ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 200 మంది నక్సలైట్లు మరణించారు. వీరిలో 183 మంది బీజాపూర్‌, నారాయణ్‌పూర్‌, దంతేవాడ, కొండగావ్‌ జిల్లాలతో కూడిన బస్తర్‌ డివిజన్‌లో మృతిచెందారు.