పాకిస్తాన్‌ క్రికెటర్ల ఇన్‌స్టా అకౌంట్లు బ్లాక్‌!

పాకిస్తాన్‌ క్రికెటర్ల ఇన్‌స్టా అకౌంట్లు బ్లాక్‌!

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంతో సహా అనేక మంది పాకిస్తాన్ క్రికెటర్ల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను భారత్‌తో బ్లాక్ చేశారు. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత కీలక చర్యలు తీసుకున్నారు. షాహీన్ అఫ్రిది, హసన్ అలీ, ఇమామ్ ఉల్ హక్, కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌ అకౌంట్లను నిషేధించారు. 

భారత్‌ ఇప్పటికే ప్రముఖ పాకిస్తాన్‌ అథ్లెట్స్‌, క్రికెటర్లు, నటీనటులకు చెందిన యూట్యూబ్‌ చానెల్స్‌, ఇన్‌స్టా అకౌంట్లను బ్లాక్‌ చేసింది. ఒలింపిక్ ఛాంపియన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ ఇన్‌స్టాగ్రామ్‌ గురువారం బ్లాక్‌ అయ్యింది. తాజాగా పాకిస్తాన్‌ క్రికెటర్ల అకౌంట్లు సైతం బ్యాన్‌ అయ్యాయి. బాబర్, రిజ్వాన్‌తో సహా ఈ ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను ఓపెన్‌ చేసేందుకు ప్రయత్నించగా `ఈ అకౌంట్‌ భారత్‌లో అందుబాటులో లేదు’ అనే సందేశాన్ని చూపిస్తున్నది.

రెచ్చగొట్టే, సున్నితమైన మతపరమైన కంటెంట్‌ను వ్యాప్తి చేసే అనేక మంది పాకిస్తానీల యూట్యూబ్ ఛానెల్‌, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను బ్లాక్‌ చేసింది. రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పేరొందిన షోయబ్‌ అక్తర్‌, (@ShoaibAkhtar100mph), పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాసిత్ అలీ యూట్యూబ్ ఛానెల్ ‘బాసిత్ అలీ’ (@BasitAliShow), పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్, సీనియర్ జర్నలిస్ట్ నౌమాన్ నియాజ్ యూట్యూబ్ ఛానెల్ ‘కాట్ బిహైండ్’, పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ యూట్యూబ్ ఛానెల్ ‘తన్వీర్ సేస్’ (@Tanveer Says) చానెల్స్‌ ఉన్నాయి. 

 
అలాగే, వాసేఇన్ఫీ చానెల్స్‌ని మూసివేశారు. అంతకు ముందు మహీరా ఖాన్, హానియా ఆమీర్ , అలీ జఫర్ అకౌంట్స్‌ని కేంద్రం బ్లాక్‌ చేసింది. ‘మెరే హుమ్‌సఫర్’, ‘కభీ మైన్ కభీ తుమ్’ వంటి పాక్ వెబ్ సిరీస్లతో ప్రజాదరణ పొందింది నటి హానియా ఆమీర్.  మహీరా ఖాన్ 2017లో షారుక్ ఖాన్ సరసన రయూస్ చిత్రంలో భారతీయ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే, 2016 ఉరీ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ నటులు బాలీవుడ్ చిత్రాల్లో పని చేయడం పూర్తిగా ఆగిపోయింది. 
 
అలాగే, పాక్‌ ప్రభుత్వానికి చెందిన అధికారిక ఎక్స్ అకౌంట్‌తో పాటు పాక్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్‌కు సంబంధించిన పలు చానెల్స్‌పై వేటు వేసింది. భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైన సున్నితమైన కంటెంట్‌, తప్పుదోవ పట్టించే కథనాలను ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణలపై ఈ యూట్యూబ్‌ ఛానళ్లను నిషేధించినట్లు కేంద్రం తెలిపింది.