భారత్ లో యువత, వృద్ధులే ఎక్కువ

భారత్ లో యువత, వృద్ధులే ఎక్కువ
భారతదేశంలో మధ్య వయస్కుల కంటే యువత, వృద్ధులు ఎక్కువగా పెరుగుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ, జర్మనీలోని బ్రెమెన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు కలిసి ‘గ్లోబల్ ఫ్లరిషింగ్ స్టడీ’ని నిర్వహించారు. ఈ పరిశోధనలో మానవుల శ్రేయస్సు, సంతోషం, కులం, మతం, రాజకీయ నమ్మకాలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. 

ఆరు ఖండాల్లో విస్తరించి ఉన్న 22 దేశాల్లోని 2 లక్షలకు పైగా ప్రజలపై ఈ అధ్యయాన్ని చేశారు. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, స్వీడన్, అమెరికా సహా అనేక దేశాల్లో అన్ని వయసులవారు అభివృద్ధి చెందారు. అయితే భారత్, ఈజిప్ట్, కెన్యా, జపాన్‌లలో మాత్రం మధ్యవయస్కుల వారు అభివృద్ధిలో వెనుకపడ్డారు. జనాభా, సామాజిక, రాజకీయ, మతపరమైన అంశాలు, బాల్య అనుభవాలతో పాటు ఆనందం, ఆరోగ్యం, మానవ సంబంధాలు వంటి వాటిపై సర్వేలో పరిశోధకులు ప్రశ్నించారు.

ప్రపంచవ్యాప్తంగా పురుషులు, మహిళలు ఎవరు అభివృద్ధిలో ముందంజలో ఉన్నారో ఈ అధ్యయనంలో నిగ్గు తేల్చారు. బ్రెజిల్లో మహిళలతో పోలిస్తే పురుషులు ఎక్కువ అభివృద్ధి చెందారు. జపాన్‌లో మగవాళ్ల కన్నా మహిళలు ముందంజలో ఉన్నట్లు తేలింది. చాలా దేశాల్లో అవివాహితులతో పోలిస్తే పెళ్లి చేసుకున్నవారు మంచి వృద్ధిని సాధించారు. 

అయితే భారత్, టాంజానియాలో మాత్రం పెళ్లికాని వారిదే పైచేయి. వివాహితలు ఒంటరిగా ఉన్నవారి కంటే తక్కువ వృద్ధిని నమోదు చేశారు. ఉద్యోగులు గణనీయమైన అభివృద్ధిని సాధించారని అధ్యయనంలో వెల్లడైంది. భారత్, జపాన్, ఇజ్రాయెల్, పోలాండ్ వంటి దేశాల్లో ఉద్యోగం చేసేవారి కంటే స్వయం ఉపాధి, రిటైర్డ్ ఎంప్లాయిస్ సంతృప్తిగా ఉన్నారని పరిశోధకులు తేల్చారు. 

ప్రపంచవ్యాప్తంగా యువత ఒకప్పుడులా అంతగా అంతగా రాణించడం లేదని వెల్లడించారు. భారత్​లో గృహనిర్మాణం, ప్రభుత్వ అప్రూవల్స్, పొలిటికల్ వాయిస్ పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. విద్యపై తక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారని స్పష్టం చేశారు. ఆర్థిక అంశాలపై మరింత శ్రద్ధ వహించాల్సి ఉందని అధ్యయనంలో తేలినట్లు వెల్లడించారు.