
భారత ప్రతినిధిగా రక్షణశాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. దీనికి ఇరుదేశాల రక్షణమంత్రులు వర్చువల్‌గా హాజరైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా రక్షణ మంత్రిత్వశాఖ అధికారులు, ఫ్రాన్స్ రాయబారి హాజరైనట్లు పేర్కొన్నాయి. ఇది పూర్తిగా భారత్-ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందమని వివరించాయి.
భారత్- ఫ్రాన్స్‌ల మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారం బలోపేతమే లక్ష్యంగా ఇరుదేశాల ప్రభుత్వాల మధ్య, ఇంకా ప్రభుత్వం, వ్యాపారాల మధ్య అనేక అనుబంధ ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తోంది. 26 రఫేల్ మెరైన్ జెట్లను విమాన వాహకనౌకలపై వెంటనే మోహరించాల్సిన అవసరం ఉంది. ఒప్పందం ప్రకారం తొలిబ్యాచ్ 2029లో రావొచ్చని, 2031 నాటికి మొత్తం చేతికొచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
ఒప్పందంలో భాగంగా భారత నావికాదళానికి ఫ్రాన్స్ నుంచి 22 సింగిల్ సీటర్, నాలుగు టు సీటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు రానున్నాయి. దీంతోపాటు వీటి నిర్వహణ, స్పేర్లు, లాజిస్టికల్ సపోర్ట్, శిక్షణకు సంబంధించిన అంశాలు సకాలంలో పూర్తయ్యేలా ఫ్రాన్స్ ప్రభుత్వమే చూసుకుంటుంది. ఈ విమానాలను ఐఎన్‌ఎస్ విక్రాంత్, ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యపై మోహరించనుంది భారత్. ప్రస్తుతం వాడుతున్న మిగ్ 29ల స్థానంలో వీటిని భర్తీ చేయనునుంది.
అంతకుముందు ఐఎన్‌ఎస్ విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కోసం యుద్ధ విమానాల కోసం ఫ్రెంచ్ డిఫెన్స్ సంస్థ డస్సాల్ట్ ఏవియేషన్ నుంచి భారత్ కొనుగోలు చేసింది. రెండు వారాల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో వీటిని కొనుగోలుకు ఆమోద ముద్ర పడింది. కాగా, ప్రస్తుతం భారత వాయుసేన మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాలను వినియోగిస్తోంది.
తాజాగా నేవీ కూడా వీటిని కొనుగోలు చేయనుండటం వల్ల రెండు దళాల మధ్య సమన్వయం పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. బడ్డీ-బడ్డీ రీఫ్యూయలింగ్‌కు అవకాశం ఉంటుందని అంటున్నారు. ఓ ఫైటర్ జెట్ రీఫ్యూయలింగ్ పాడ్ సాయంతో మరో ఫైటర్ జెట్‌లో ఇంధనం నింపడాన్ని ఇలా అంటారు. అప్పుడు భారీ ఫ్యూయల్ ట్యాంకర్ విమానాల అవసరం ఉండదు
More Stories
చైనాపై ట్రంప్ 100 శాతం అదనపు సుంకాలు
మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
జాన్సన్ & జాన్సన్ కు రూ.8 వేల కోట్ల జరిమానా!