
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలతో డీజీపీ జితేందర్ అప్రమత్తం అయ్యారు. తెలంగాణకు వచ్చిన పాకిస్థానీయులకు డిజిపి కీలక ఆదేశాలు జారీ చేశారు. పాకిస్థానీయులకు వీసాలను కేంద్రం నిలిపివేసిందని, ఇప్పటికే వీసాలు పొందిన వారికి ఈ నెల 27 వరకు గడువు ఉందని చెప్పారు. హైదరాబాద్‌లో దాదాపు 200 పైచిలుకు పాకిస్తానీలు ఉన్నారని సమాచారం అందడంతో హైఅలర్ట్ ప్రకటించారు.
తక్షణమే తెలంగాణలో ఉన్న పాకిస్తానీలు వెంటనే భారత్‌ను వదిలి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ తర్వాత వీసాలు రద్దు చేస్తామని, ఆలోపే వెళ్లిపోవాలని ఆదేశించారు. మెడికల్ వీసా దారులకు ఈనెల 29వ తేదీ వరకూ అవకాశం ఇస్తామని, ఆ తర్వాత క్షణం కూడా ఇక్కడ ఉండటానికి వీళ్లేదని కఠిన ఆదేశాలు జారీ చేశారు. అక్రమంగా తెలంగాణలో ఉండాలనుకుంటే ఊరుకునేది లేదని, జల్లెడ పట్టి బయటకు తీసుకొస్తామని హెచ్చరించారు. న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈనెల 30 వరకు అటారి వాఘ బార్డర్ ఓపెన్ ఉంటుంది. హైదరాబాద్‌లో 208 మంది పాకిస్తానీయులు ఉన్నారు. హైదరాబాద్‌లో ఉన్న పాకిస్తానీయులపై నిఘా పెట్టామని తెలిపారు. అంతకుముందు, పాకిస్తానీయులు 48 గంటల్లో దేశాన్ని వీడాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు.
More Stories
అభ్యర్థుల ఎంపికకై ముగ్గురు సభ్యులతో బిజెపి కమిటీలు
హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఛార్జీల పెంపు
ఆమెరికాలో కాల్పులు.. హైదరాబాద్‌కి చెందిన విద్యార్థి మృతి