
26 మందిని హతమార్చిన పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి బలమైన ప్రతిస్పందన భారతదేశం వైపు నుండి ఆశిస్తున్నట్లు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఉగ్రవాదులు తమ ‘మతం’ గురించి అడిగిన తర్వాత ప్రజలను చంపారని ఆందోళన వ్యక్తం చేస్తూ హిందువులు ఎప్పుడూ అలాంటి పని చేయరని చెప్పారు.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన మూడు రోజుల తర్వాత ముంబైలో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ ఉగ్రదాడికి గురైనవారిలో ఎక్కువ మంది పర్యాటకులని గుర్తు చేశారు. “యుద్ధం ధర్మం, అధర్మం మధ్య జరుగుతుంది” అని చెప్పారు. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదుల చర్యలను డా. భగవత్ తీవ్రంగా ఖండిస్తూ వారి క్రూరమైన చర్యలు మతపరమైన గుర్తింపుపై దృష్టి సారించి జరిగాయని ఆయన గుర్తు చేశారు.
“మన సైనికులు, మన ప్రజలు, వారి మతం ఆధారంగా ఎవరినీ ఎప్పుడూ చంపలేదు” అని భగవత్ స్పష్టం చేశారు. “ఈ దాడికి కారణమైన మతోన్మాదులకు మన ప్రపంచంలో స్థానం లేదు. హిందువులు ఎప్పటికీ అలా ప్రవర్తించరు” అని తెలిపారు. “మన హృదయాలలో బాధ ఉంది. మనం ఆగ్రహంతో ఉన్నాము. కానీ చెడును నాశనం చేయడానికి, బలాన్ని చూపించాలి. రావణుడు తన మనసు మార్చుకోవడానికి నిరాకరించాడు. వేరే మార్గం లేదు. రాముడు సంస్కరించడానికి అవకాశం ఇచ్చిన తర్వాతే అతన్ని చంపాడు” అని ఆయన గుర్తు చేశారు.
“ఇది మతాలు లేదా వర్గాల మధ్య యుద్ధం కాదు. ఇది సరైనది- తప్పు మధ్య జరిగే యుద్ధం. ఎందుకంటే చంపబడిన వారిని వారి మతం గురించి అడిగారు. ఏ హిందువు లేదా మన సైనికులు తమ మతాన్ని అడిగిన తర్వాత ఎవరినీ చంపలేదు. కొంత మంది తీవ్రవాదులు తమ సొంత మతాన్ని తప్పుగా అర్థం చేసుకుని అలాంటి చర్యలకు పాల్పడ్డారు. ఆగ్రహం, దుఃఖం ఉంది. దేశం బలంగా మారాలి. మన ఎనిమిది చేతుల శక్తి ద్వారా రాక్షసులను నాశనం చేయాలి” అని డా. భగవత్ ఉద్బోధించారు.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!