
రష్యా బలగాలు తెరిపి లేకుండా సాగించిన క్షిపణుల దాడి క్రమంలో నగర పౌరులు తల్లడిల్లారు. బయటకు రాలేక, ఇండ్లలో ఉండలేక వారి పరిస్థితి అగమ్యగోచరం అయింది. దక్షిణాఫ్రికాలో పర్యటనలో ఉన్న అధ్యక్షులు జెలెన్‌స్కీ వెంటనే స్వదేశం తిరిగి వచ్చారు. రష్యా అత్యంత క్రూర రీతిలో వ్యవహరించిందని, సాధారణ పౌరులను 11 గంటల పాటు బందీలను చేసిందని వ్యాఖ్యానించారు.
నగర మేయర్ విటలి క్లిస్చ్‌కో స్పందిస్తూ బాధిత కుటుంబాలకు శుక్రవారం అధికారికంగా సంతాప దినం పాటిస్తారని ప్రకటించారు.రష్యా వైమానికి బలగాలు ఈసారి ఏకంగా 66 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించాయి. ఇతరత్రా మారణాయధాలతో కూడా నివాసిత ప్రాంతాలపై విరుచుకుపడిదంని చెప్పారు. దాడుల దశలో జెలెన్‌స్కీ ప్రిటోరియాలో ఉన్నారు. దాడి సమాచారం తెలియగానే స్వదేశానికి బయలుదేరి వచ్చారు.
జెలెన్‌స్కీపై ఇటీవలే అమెరికా అధ్యక్షులు ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. రష్యాతో యుద్ధ విరమణ జరుగకుండా జెలెన్‌స్కీ తప్పించుకు తిరుగుతున్నాడని , పైగా దీనికి పలు కారణాలు చూపుతున్నాడని, దీర్ఘకాలిక యుద్ధం వల్ల ఎవరికీ ప్రయోజనం? అని నిలదీశారు. ఈ వ్యాఖ్యలపై జెలెన్‌స్కీ ఎటువంటి స్పందన వెలువరించలేదు. కాగా ఇరుపక్షాలతో సంప్రదింపుల విషయంలో ట్రంప్ పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. రష్యా అధ్యక్షులు పుతిన్‌తో ఈ మేరకు ఇప్పటికే సమగ్ర చర్చలు జరిపారు.
More Stories
ఆసియాన్ సదస్సులో వర్చువల్ గా మోదీ
రష్యా చమురు సంస్థలపై ట్రంప్ ఆంక్షలు
మహిళల కోసం జైషే ఆన్ లైన్ ‘జీహాదీ కోర్స్’