
రాఫెల్ జెట్ల సారథ్యంలో ఐఏఎఫ్ తన యుద్ధ విమానాల సామర్థ్యాన్ని ప్రదర్శించింది. హర్యానాలోని అంబాలా, పశ్చిమ బెంగాల్లోని హషిమారాలో రెండు రాఫెల్ స్కాడ్రన్లను ఐఏఎఫ్ నిర్వహిస్తోంది. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన రాఫెల్ యుద్ధ విమానాలు ప్రస్తుత వైమానిక విన్యాసాలలో కీలక భూమికను పోషిస్తున్నాయి. చదునుగా ఉన్న ప్రదేశాలు, పర్వత ప్రాంతాలతో సహా భిన్న భూస్వరూపాలు కలిగిన ప్రదేశాలపై వైమానిక దాడులకు సంబంధించిన విన్యాసాలు ప్రస్తుతం జరుగుతున్నట్లు వారు చెప్పారు.
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన వేళ ఐఏఎఫ్ ఆపరేషన్ ఆక్రమణ్ చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విన్యాసాలలో ‘టాప్ గన్స్’ పాల్గొంటున్నాయని, హై క్వాలిఫైడ్ ఇన్స్ట్రక్లర్ల ఆధ్వర్యంలో జరుగుతున్న వీటిని ఐఏఎఫ్ ప్రధాన కార్యాలయం అత్యంత నిశితంగా పర్యవేక్షిస్తోందని ఐఏఎఫ్ పైలట్లు వెల్లడించారు.
భారత నేవీ కూడా అప్రమత్తమైంది. తాజాగా గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎస్ఎస్ సూరత్ తొలిసారిగా గగనతలంలో వస్తున్న సీ స్కిమ్మింగ్ టార్గెట్ను అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. 70 కిలోమీటర్ల రేంజ్లో లక్ష్యాన్ని కూల్చేసింది. ఈ మేరకు నౌకాదళం ఓ వీడియోను విడుదల చేసింది. సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లను, క్షిపణులను సీ స్కిమ్మింగ్ టార్గెట్లుగా పిలుస్తారు.
భారత్ దాడులు చేసే అవకాశం ఉన్నదన్న కారణంతో పాకిస్థాన్ క్షిపణి పరీక్షలకు సిద్ధమైంది. ఉపరితలంపై నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణి పరీక్షలను నిర్వహించనున్నట్టు పాక్ మిలిటరీ నోటమ్ (నోటీస్ టూ ఎయిర్మన్) తెలిపింది. శుక్రవారంనాడు ఈ పరీక్షలు ఉండనున్నట్లు తెలుస్తోంది. 480 కిలోమీటర్ల మేర పరిధిలోని లక్ష్యాలను నాశనం చేయగల క్షిపణులను పాక్ పరీక్షించే అవకాశం ఉన్నదని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!