
ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో సైనిక దర్యాప్తునకు ఇజ్రాయిల్ ఆదేశించింది. ఈ ఘటనలో సైన్యానికి సంబంధించి వృత్తిపరమైన వైఫల్యాలు చోటుచేసుకున్నట్లు తేలింది. దీంతోనే డిప్యూటీ కమాండర్‌పై వేటు పడింది. ఘటన సమయంలో వాహనాలకు ఎటువంటి ఎమర్జెన్సీ సిగల్స్ లేవని ఇజ్రాయెల్ తొలుత పేర్కొంది. అయితే, వైద్య బృందంలో ఒకరి సెల్‌ఫోన్ నుంచి సేకరించిన వీడియో ఫుటేజీ మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది.
దీంతో వెనక్కి తగ్గిన సైన్యం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. చీకట్లో సంబంధిత వాహనాలను హమాస్ మిలిటెంట్లకు చెందినవిగా ఐడీఎఫ్ డిప్యూటీ బెటాలియన్ కమాండర్ అంచనా వేసినట్లు తేలింది. అయితే, ఘటనా స్థలం నుంచి సేకరించిన వీడియోలో మాత్రం అంబులెన్సుల లైట్లు వెలుగుతున్నట్లు కనిపించాయి. తమ దళాలు పరిస్థితిని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని సైన్యం తెలిపింది. ఐరాస సిబ్బంది వాహనంపై దాడిని ఆదేశాల ఉల్లంఘనగా పేర్కొంది.
అంబులెన్సులను ధ్వంసం చేయాలనే నిర్ణయం తప్పేనని, అయితే, ఈ ఘటనను దాచిపెట్టే ప్రయత్నం చేయలేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. హమాస్ తన ఫైటర్లను అంబులెన్సులు, ఇతర అత్యవసర వాహనాల్లో తరలిస్తోందని, ఆస్పత్రులు, ఇతర పౌర సదుపాయాల్లో దాచిపెడుతోందని ఇజ్రాయెల్ పలు సందర్భాల్లో ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఇటువంటి దాడులను సమర్థించుకుంటోంది. అయితే, వైద్య యంత్రాంగం ఈ ఆరోపణలను ఖండించింది.
More Stories
రహస్య పత్రాల లీక్‌లో భారత సంతతి రక్షణ వ్యూహకర్త అరెస్ట్
బలహీనపడిన అమెరికా పాస్‌పోర్ట్
యుద్ధం ముగిసింది.. గాజా కాల్పుల విరమణ ఒప్పందం!