
ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్సు 2025 కు సంబంధించి ప్రభుత్వం గజెట్ ను గురువారం జారీ చేసింది. ఏపీ షెడ్యూల్డు ఉపకులాల వర్గీకరణ ఆర్డినెన్సు 2025కు రాష్ట్ర గవర్నర్ అబ్జుల్ నజీర్ ఆమోదాన్ని తెలియచేయటంతో గెజిట్ జారీకి సంబంధించిన ఉత్తర్వులను న్యాయశాఖ కార్యదర్శి జి. ప్రతిభా దేవి జారీ చేశారు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా రెల్లి, మాల, మాదిగ ఉపకులాలను ఏబీసీ కేటగిరీలుగా విభజించారు.
రెల్లి ఉపకులాలకు 1 శాతం, మాల ఉపకులాలకు 6.5 శాతం, మాదిగ ఉపకులాలకు 7.5 శాతం మేర రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రభుత్వం ఈ గెజిట్ జారీ చేసింది. విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఈ రిజర్వేషన్లను వర్తింపచేసేలా ప్రభుత్వం ఈ ఆర్డినెన్సును జారీ చేసింది. త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను కూడా ఈ వర్గీకరణను పరిగణనలోకి తీసుకునే జారీ చేయనున్నారు.
ఎస్సీ వర్గీకరణ అంశంపైనా ఇటీవలే కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. దీనిపై ఇటీవల రాజీవ్‌రంజన్ మిశ్రా కమిషన్ సమర్పించిన నివేదికకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రాన్ని యూనిట్‌గా వర్గీకరణ చేయాలని కమిషన్ నివేదిక ఇచ్చింది. జిల్లాను యూనిట్‌గా వర్గీకరణ చేయాలన్న ఎమ్మెల్యేల ప్రతిపాదనపై చర్చించింది.
దీనిపై ఇటీవల రాజీవ్‌రంజన్ మిశ్రా కమిషన్ సమర్పించిన నివేదికకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.రాష్ట్రాన్ని యూనిట్‌గా వర్గీకరణ చేయాలని కమిషన్ నివేదిక ఇచ్చింది. జిల్లాను యూనిట్‌గా వర్గీకరణ చేయాలన్న ఎమ్మెల్యేల ప్రతిపాదనపై చర్చించింది. ఈ నేపథ్యంలోనే 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం యూనిట్‌గా వర్గీకరణకు మంత్రివర్గం నిర్ణయించింది. 2026 జనాభా లెక్కలు వచ్చాక జిల్లా యూనిట్‌గా వర్గీకరణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.
అదేవిధంగా బుడగజంగాలు, మరో కులాన్ని ఎస్సీల్లో చేర్చేందుకు తీర్మానం చేయాలని నిర్ణయం తీసుకుంది.2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం యూనిట్‌గా వర్గీకరణకు మంత్రివర్గం నిర్ణయించింది. 2026 జనాభా లెక్కలు వచ్చాక జిల్లా యూనిట్‌గా వర్గీకరణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా బుడగజంగాలు, మరో కులాన్ని ఎస్సీల్లో చేర్చేందుకు తీర్మానం చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వానికి గత నెలలో ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా నివేదిక ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా రిజర్వేషన్ విధానం, ఎస్సీల్లో ఉపవర్గాల ఆర్ధిక స్వావలంబన తదితర అంశాలపై ఏకసభ్య కమిషన్ అధ్యయనం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ ఉపకులాల నుంచి విజ్ఞప్తులు, అభ్యర్ధనలు, అభిప్రాయ సేకరణపై ఏక సభ్య కమిషన్ను జరిపారు.
More Stories
`త్రిశూల’ వ్యూహంతో జనసేన బలోపేతంపై పవన్ దృష్టి
విశాఖ సముద్ర తీర కోత నివారణకు కేంద్రం రూ 222 కోట్లు
ప్రముఖ నవలా రచయిత ’లల్లాదేవి’ కన్నుమూత