కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. రూ. 7.5 కోట్ల విలువైన భూముల వ్యవహారంలో వాద్రాలకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 8వ తేదీన ఈడీ విచారణకు హాజరు కావాలంటూ రాబర్ట్ వాద్రాకు నోటీసులు జారీ చేయగా గైర్హాజరయ్యారు. దీంతో ఈడీ మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేసింది.
దీంతో మంగళవారం నాడు రాబర్ట్ వాద్రా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈడీ సమన్లు జారీ అయిన తర్వాత వాద్ర తన నివాసం నుంచి దిల్లీలోని ఈడీ కార్యలయానికి కాలినడకన వెళ్లారు. ఈ సందర్భంగా ఈడీ కార్యలయం ముందు మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఏదైనా మంచి చేసినప్పుడల్లలా తనను అణచివేయడానికి ప్రయత్నిస్తారని ఆరోపించారు.
ఈడీ సమన్లు జారీ చేయడాన్ని రాజకీయ ప్రతీకార చర్యగా పేర్కొన్నారు. ప్రభుత్వం దర్యాప్తు సంస్థల అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. తన దగ్గర ఏమి లేదని, అందుకే తనకు ఎటువంటి భయం లేదని తెలిపారు. అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తానని చెప్పారు. గుర్గావ్ ల్యాండ్ స్కామ్, భూసేకరణ లావాదేవీల కేసులో ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు.
రాబర్ట్ వాద్రా హర్యానాలో జరిగిన భూ ఒప్పందంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ల్యాండ్ స్కామ్, మనీలాండరింగ్ కేసును ఎదుర్కొంటున్నారు. గతంలో మరో మనీలాండరింగ్ కేసులో ఆయనను ఈడీ ప్రశ్నించింది. తాజా కేసు ఫిబ్రవరి 2008లో వాద్రాకు చెందిన స్కెలైట్ హాస్పటల్ కోసం రూ. 7. కోట్లకు భూమి కొనుగోలుకు సంబధించినది.
సాధారణంగా నెలలు పట్టే ఈ మ్యుటేషన్ ప్రక్రియ కేవలం ఒక్క రోజులోనే పూర్తవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అయితే, కొంతకాలం తరువాత ఆ భూమిలో హౌసింగ సొసైటీని అభివృద్ధి చేయడానికి అనుమతి లభించింది. ఆ సమయంలో ప్లాట్స్ ధర కూడా భారీగా పెరిగింది. అదే సంవత్సరం జూన్‌లో సదరు భూమిని డీఎల్‌ఎఫ్‌కి రూ. 58 కోట్లకు విక్రయించారు. ఈ వ్యవహారంపైనే ఈడీ సీరియస్‌గా దృష్టి పెట్టింది.

More Stories
టాటా ట్రస్ట్స్ పై న్యాయపోరాటంకు మెహ్లీ మిస్త్రీ
దేశ ఆర్థిక వ్యవస్థపై టెక్ రంగంలో లేఆఫ్స్ ప్రభావం
షట్డౌన్ తో అమెరికాకు నెల రోజుల్లో 7 బిలియన్ డాలర్ల నష్టం