
భార త్, ఫ్రాన్స్ మధ్య అంతర్ ప్రభుత్వ యంత్రాంగం కింద కాంట్రాక్ట్‌పై సంతకాల అనంతరం సుమారు ఐదు సంవత్సరాల్లో జెట్ల సరఫరా మొదలవుతుంది. వరుస సంప్రదింపులు, ప్లాట్‌ఫారమ్ మదింపు పరీక్షల దరిమిలా 2023 జూలైలో రక్షణ మంత్రిత్వ శాఖ భారీ స్థాయిలో రఫాలె జెట్ల కొనుగోలుకు ప్రాథమికంగా ఆమోదం తెలిపింది.
ఆ ఒప్పందం కింద, భారతీయ నౌకాదళం రఫేల్(మెరైన్) జెట్ల ఉత్పత్తి సంస్థ దసాల్స్ ఏవియేషన్ నుంచి ఆయుధ వ్యవస్థలు, విడిభాగాలు సహా అనుబంధ పరికరాలను కూడా పొందుతుంది. శక్తివంతమైన ఆధునిక ఆయుధ వ్యవస్థలను కలిగి ఉండే రాఫెల్ యుద్ధ విమానాలు భారత నౌకాదళ పోరాట శక్తిని బలోపేతం చేస్తాయి. నాలుగేళ్లలో రాఫెల్ యుద్ధ విమానాల సరఫరా ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
భారతీయ వైమానిక దళం (ఐఎఎఫ్) గగనయానం స్థితిలో 36 రఫాలె యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. కనీసం మరి రెండు రఫేల్ జెట్ల స్కాడ్రన్‌లు కొనుగోలు చేయాలని కూడా ఐఎఎఫ్ యోచిస్తోంది. భారత్, ఫ్రాన్స్ మధ్య రక్షణ, వ్యూహాత్మక సంబంధాలు కొన్ని సంవత్సరాలుగా వృద్ధి చెందుతున్నాయి. భారత నౌకాదళం బలాన్ని మరింత పెంచేందుకు మూడు స్కార్పీన్ జలాంతర్గాముల కొనుగోలుకు కూడా రక్షణ మంత్రిత్వ శాఖ సుమారు రెండేళ్ల క్రితం ఒక ప్రతిపాదనను ఆమోదించింది. సిసిఎస్ ఆ ప్రాజెక్టుకు ఇంకా ఆమోద ముద్ర వేయాల్సి ఉంది.
More Stories
రైల్లో అమ్మే వాటర్ బాటిళ్ల ధర తగ్గింపు
జీఎస్టీ సంస్కరణలతో తగ్గనున్న ఆహార వస్తువుల ధరలు
భారీ సైబర్ దాడితో నిలిచిపోయిన పలు దేశాల విమానాశ్రయాలు