ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సంధ్యా రాణి ప్రారంభించగా ఐటీడీఏ, గిరిజన విద్యాలయాల విద్యార్థులు పాల్గొన్నారు. యోగ గురు పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం అల్లూరి జిల్లా అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ ప్రదర్శన అందరినీ అలరించింది.
లండన్ నుంచి వచ్చిన ప్రపంచ రికార్డు యూనియన్ మేనేజర్ అలీస్ రేనాడ్ కార్యక్రమాన్ని పరిశీలించి ప్రపంచ రికార్డుగా నమోదు చేశారు. రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని కలెక్టర్ దినేశ్‌కుమార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో జరిగిన గొప్ప కార్యక్రమం ఇది. 5 మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు ఈ మహా సూర్యవందనంలో పాల్గొన్నారు.
గిరిజన బిడ్డలు తలచుకుంటే ఏదైనా సాధిస్తారు అనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో ఇది సాధ్యమైందని ఆమె చెప్పారు. గిరిజన విద్యార్థుల ఆరోగ్యానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని చెబుతూ విద్యార్థుల నిత్య జీవితంలో ఇది నిరంతర అభ్యాసంగా నిలవాలని ఆమె సూచించారు.

More Stories
ఏపీలో కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు
1500 ఏళ్ల భావన్నారాయణ స్వామి రథం వేలం
28న అమరావతిలో 12 బ్యాంకుల భవనాలకు శంకుస్థాపన