“అంధకారం అస్తమిస్తుంది. సూర్యుడు ఉదయిస్తాడు. కమలం వికసిస్తుంది”.. సరిగ్గా 45 ఏళ్ల క్రితం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున అటల్ బిహారి వాజ్ పేయి ప్రసంగంలో మాటలు ఇవి. 1980, ఏప్రిల్ 6న అటల్ బిహారి వాజ్ పేయి, ఎల్ కె అద్వాని ఆధ్వర్యంలో బీజేపీ అవతరించింది. అప్పుడు ఇద్దరు ఎంపీలతో మొదలైన బీజేపీ, ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది.
“ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల కృషి వల్ల ప్రపంచంలోనే బీజేపీ అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. దేశంలో మూడు పర్యాయాలుగా ప్రజలకు సేవలు అందిస్తోంది. ఈ చరిత్రాత్మక సందర్భంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలు, నాయకులకు శుభాకాంక్షలు చెబుతున్నా” అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

More Stories
డిసెంబర్ 15న బ్లూ బర్డ్-6 అమెరికా ఉపగ్రహ ప్రయోగం
శ్రీవారి సేవలో పట్టుకు బదులు పాలిస్టర్ శాలువాలు
2 నెలల పాటు పర్వదినాల్లో టిటిడి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు