
గత ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆర్ధిక వృద్ధి రేటు సాధించిన రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. 2024- 2025 ఆర్థిక సంవత్సరంలో ఏపీ.. మొత్తంగా 8.21 శాతం మేర వృద్ధి రేటును అందుకుంది. ఏపీ కంటే తమిళనాడు ముందంజలో ఉంది. 9.69 శాతం మేర వృద్ధి రేటుతో అగ్రస్థానంలో నిలిచింది.
ఏపీలో మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీస్, వ్యవసాయ రంగాల్లో వృద్ధి రేటు కనిపించినట్లు కేంద్ర ప్రభుత్వంలో తన నివేదికలో పొందుపరిచారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో నిలుస్తోండటం, పారిశ్రామిక విధానాలు, పరిపాలనలో పారదర్శకత.. వంటి చర్యలు పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని పెంపొందడానికి దోహదం చేశాయి.
బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ అమలులో కూడా ఏపీ అగ్రగామిగా గుర్తింపు పొందింది. రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా మార్చడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తోండటం వల్లే ఏపీ అత్యధిక ఆర్థిక వృద్ధి రేటును నమోదు చేయగలిగింది. గత ఏడాది జూన్‌లో చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఆర్థికరంగంపై దృష్టి పెట్టారు.
రాష్ట్రం ఎదుర్కొంటోన్న కీలక సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తూ వచ్చారు. గత ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి సంభవించిన నష్టాల నుండి కోలుకోవడానికి తక్షణ చర్యలను తీసుకుంటోన్నారు. టీడీపీ- జనసేన- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంస్కరణలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి. పారిశ్రామిక పెట్టుబడులను మరింత ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, స్థిరమైన ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడమే లక్ష్యంగా మూడు కొత్త పారిశ్రామిక విధానాలను చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది.
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 10 నెల కాలంలో దాదాపుగా రూ. 8 లక్షల కోట్ల పెట్టుబడులు, అయిదు లక్షల ఉద్యోగాల కల్పన వంటి చర్యలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనం. చంద్రబాబు దార్శనిక విధానాల ద్వారా ఈ పారిశ్రామిక పునరుజ్జీవనానికి దోహదపడింది. ఏపీ తన వృద్ధిరేటును గణనీయంగా పెంచుకోవడానికి, దేశ ఆర్థిక ప్రగతికి ఓ గ్రోత్ ఇంజిన్‌గా ఎదుగుతోంది.
More Stories
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు
ఈనెల 22న బీజేపీ రాష్ట్ర వ్యాప్త సంబరాలు