హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు

హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్.గౌతం రావును బిజెపి ప్రకటించడం, ఆయన నామినేషన్ దాఖలు చేయడం శుక్రవారం జరిగింది. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ ఎం.ఎస్ ప్రభాకర్ పదవీకాలం మే 1తో ముగియనుంది. దీంతో కొత్త ఎమ్మెల్సీ ఎన్నికకు ఏప్రిల్ 23న పోలింగ్ జరుగనుంది.

మాజీ ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ రాంచందర్ రావు నాయకత్వంలో, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు నగరంలోని పార్టీ కార్పొరేటర్లు, నగర అధ్యక్షులు, సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరిపి, వారితో చర్చించిన అనంతరం అభ్యర్థిని పార్టీ నాయకత్వం ఖరారు చేసినట్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు  చింతల రామచంద్రారెడ్డి తెలిపారు.

మొదటి నుంచి అఖిల భారత విద్యార్థి పరిషత్ లో చురుగ్గా పాల్గొని, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం గౌతమ్ రావు కృషి చేశారు. 30 ఏళ్లు ఏబీవీపీలో పనిచేయగా, గత 15 ఏళ్లుగా బిజెపిలో పనిచేస్తూ, భాగ్యనగర సంఘటన సహ మంత్రిగా, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులుగా గౌతంరావు సేవలందించారు.

పార్టీ పేరులోనే మతాన్ని ఉంచుకున్న ఎంఐఎం పార్టీ ప్రజావ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా బిజెపి మొదటి నుంచి నిరంతర పోరాటం చేస్తోందని రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి భయపడి కాంగ్రెస్ పోటీ చేయడం లేదని,  అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఓట్ల సంతుష్టీకరణ రాజకీయాల నేపథ్యంలో మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయడం లేదన్న భావన స్పష్టంగా కనిపిస్తోందని ఆయన విమర్శించారు.

హైదరాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు మార్చి 24న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. శుక్రవారంతో నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ. దీంతో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతం రావు పేరును పార్టీ ఖరారు చేసింది.  మొదటి నుంచి అఖిల భారత విద్యార్థి పరిషత్ లో చురుగ్గా పాల్గొని, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. 30 ఏళ్లు ఏబీవీపీ లో పనిచేస్తూ, గత 15 ఏళ్లుగా బిజెపిలో పనిచేస్తూ, భాగ్యనగర సంఘటన సహ మంత్రిగా, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులుగా గౌతంరావు గారు సేవలందించారు.
ఇటీవల కరీంనగర్ లో రెండు ఎమ్యెల్సీ స్థానాలను గెలుచుకున్న బిజెపి అదే ఉత్సాహంతో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో మజ్లిస్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఈ ఎన్నికలలోపోటీచేస్తున్నది. ఆ పార్టీకి కాంగ్రెస్, బిఆర్ఎస్ దాసోహం కావడాన్ని ప్రజల ముందు బహిర్గతం చేసేందుకు సిద్ధమవుతున్నది. త్వరలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఈ ఎన్నిక ప్రభావం ఉండే అవకాశం ఉంది.
హైదరాబాద్ కలెక్టరేట్ పరిధిలోని 84 కార్పొరేటర్ అభ్యర్థులు, 15 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, నలుగురు పార్లమెంటు సభ్యులు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఇద్దరు ఎమ్మెల్సీలు కలుపుకొని సుమారు 117 మంది ఓటర్లు ఈ ఎన్నికలో పాల్గొంటారు.
ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరుగనుండగా, ఏప్రిల్ 9 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఇక ఏప్రిల్ 23న పోలింగ్ జరుగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఏప్రిల్ 25న ఫలితాలను ప్రకటించనున్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజవర్గం ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో కోడ్ అమలులోకి వచ్చింది.