ట్రంప్ 26 శాతం సుంకాలు ఎదురుదెబ్బ కాదు

ట్రంప్ 26 శాతం సుంకాలు ఎదురుదెబ్బ కాదు
భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాలు ప్రకటించడంపై కేంద్రం స్పందించింది. అమెరికా విధించిన సుంకాల ప్రభావాన్ని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విశ్లేషణ చేపట్టింది. 

ఈ విషయాన్ని కేంద్రంలోని సీనియర్‌ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.. అయితే, ఇక్కడో మార్గం ఉందని పేర్కొంది. అమెరికా ఆందోళనలను ఏ దేశమైనా పరిష్కరించగలిగితే ఆ దేశంపై సుంకాల తగ్గింపును ట్రంప్‌ యంత్రాంగం పునఃపరిశీలించే నిబంధన ఉందని పేర్కొన్నారు. కాబట్టి ట్రంప్‌ నిర్ణయం భారత్‌కు ఎదురుదెబ్బ కాదని కేంద్ర వాణిజ్య శాఖలోని ఓ సీనియర్‌ అధికారు తెలిపారు.

“ట్రంప్‌ ప్రకటించిన టారిఫ్‌ల ప్రభావం మన దేశంపై ఎంత ఉండొచ్చనే అంశాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ విశ్లేషిస్తోంది. అయితే, ఇక్కడో మార్గం ఉంది. అమెరికా ఆందోళనలను ఏ దేశమైనా పరిష్కరించగలిగితే ఆ దేశంపై సుంకాల తగ్గింపును ట్రంప్‌ యంత్రాంగం పరిశీలించే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఇది మిశ్రమ ఫలితమే తప్ప, భారత్‌కు ఎదురుదెబ్బ కాదు” అని అధికారి వివరించారు.

ట్రంప్‌ విధించిన 26 శాతం టారిఫ్‌లో 10 శాతం సుంకం ఏప్రిల్‌ 5 నుంచి అమల్లోకి వస్తుందని సదరు అధికారి వెల్లడించారు. మిగతా 16 శాతం ఏప్రిల్‌ 10 నుంచి విధించనున్నట్లు తెలిపారు. అయితే, సుంకాల ప్రకటన సందర్భంగా భారత ప్రధాని మోదీ గురించి ట్రంప్‌ ప్రస్తావించారు. తనకు మోదీ గొప్ప స్నేహితుడని, అయితే భారత్‌ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదని అభిప్రాయపడ్డారు. అందుకే 52 శాతం సుంకాలను విధిస్తోందని ట్రంప్‌ చెప్పారు.