భారత్‌పై ప్రతీకార సుంకాలకు సమయం ఆసన్నమైందని శ్వేతసౌధం ప్రకటించింది. అమెరికా వస్తువులపై సుంకాలు విధిస్తున్న దేశాలపై అమెరికా విధించనున్న ప్రతీకార సుంకాలు ఏప్రిల్ 2(బుధవారం) నుంచి అమలులోకి రానున్నాయి. అన్యాయంగా సుంకాలు విధిస్తూ అమెరికా ఎగుమతుదారులను దారుణంగా దెబ్బతీస్తున్న దేశాలలో భారత్ కూడా ఉందని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది.
అమెరికా వ్యవసాయ ఎగుమతులపై భారత్ 100 శాతం సుంకాన్ని విధిస్తోందని, కొన్ని విదేశీ మార్కెట్లను చేరుకోవడానికి అమెరికా వస్తువులకు సాధ్యపడడం లేదని వైట్ హౌస్ సెక్రటరీ కారోలిన్ లీవిట్ పేర్కొన్నారు. ఈ దేశాలు అమెరికాను చాలా ఏళ్లుగా పీల్చి పిప్పి చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. అమెరికన్ కార్మికుల పట్ల తమ వ్యతిరేకతను ఈ చర్యలు స్పష్టంగా చూపుతున్నాయని ఆమె తెలిపారు. ప్రతీకారానికి సమయం ఆసన్నమైందని ఆమె ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు చారిత్రాత్మక మార్పులు తీసుకురానున్నారని, బుధవారం అది జరుగుతుందని లీవిట్ తెలిపారు.
యూరోపియన్ యూనియన్, భారతదేశం, జపాన్, కెనడా నుండి భారీ సుంకాలను జాబితా చేసిన ఒక కాగితాన్ని పట్టుకుని, వైట్ హౌస్ ప్రెస్ ప్రతినిధి ఇలా చెప్పారు: “మనం కలిగి ఉన్న అన్యాయమైన వాణిజ్య పద్ధతులను మీరు పరిశీలిస్తే – అమెరికన్ పాల ఉత్పత్తులపై యూరోపియన్ యూనియన్ నుండి 50 శాతం. మీకు అమెరికన్ బియ్యంపై జపాన్ నుండి 700 శాతం సుంకం ఉంది. మీకు అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులపై భారతదేశం నుండి 100 శాతం సుంకం ఉంది. మీకు అమెరికన్ వెన్న, అమెరికన్ చీజ్‌లపై కెనడా నుండి దాదాపు 300 శాతం సుంకం ఉంది.”
“పలు దేశాలు అన్యాయమైన వాణిజ్య పద్ధతులను అనుసరిస్తున్నాయి. అమెరికా పాల ఉత్పత్తులపై యూరోపియన్ యూనియన్ 50 శాతం సుంకాలు విధిస్తోంది. అమెరికా బియ్యంపై జపాన్ 700 శాతం సుకం వసూలు చేస్తోంది. యూఎస్ బటర్, చీజ్‌పై కెనడా 300 శాతం, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100 శాతం టారిఫ్‌లు విధిస్తున్నాయి” అని ఆమె తెలిపారు.
“వీటి వల్ల మా ఉత్పత్తులను ఆయా మార్కెట్లకు ఎగుమతి చేయడం కష్టతరంగా మారుతోంది. ఈ కారణంగా అమెరికన్ల వ్యాపారాలు కూడా తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అందుకే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించేందుకు ఇదే సరైన సమయం. అధ్యక్షుడు చారిత్రాత్మక మార్పులు చేయబోతున్నారు” అని కరోలిన్ లీవిట్ వెల్లడించారు.
ఇదిలా ఉండగా, అమెరికా ప్రతీకార సుంకాలు ఏప్రిల్ 2న అమలులోకి వచ్చిన తర్వాత ఆ దేశ వస్తువులపై భారత్ కూడా గణనీయంగా సుంకాలు తగ్గిస్తుందని ట్రంప్ సోమవారం వెల్లడించారు. అమెరికన్ కార్లపై 2.5 శాతం సుంకాన్ని తగ్గిస్తున్నట్టు యూరోపియన్ యూనియన్ రెండు రోజుల క్రితం ప్రకటించిందన్న సంగతి ట్రంప్ గుర్తుచేశారు.
మరోవంక, అమెరికా ప్రతీకార సుంకాల్ని విధిస్తున్నవేళ, భారతీయ వస్తువులు మరిన్ని కొనుగోలు చేసేందుకు చైనా సిద్ధమని చైనా రాయబారి యూ ఫీహాంగ్ వెల్లడించారు. వాణిజ్యం, ఇతర రంగాలలో ఆచరణాత్మక సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు భారత్‌తో కలసి పనిచేసేందుకు చైనా సిద్ధమని ఆయన చెప్పారు. చైనా మార్కెట్‌కు అనుకూలంగా ఉండే మరిన్ని భారత వస్తువులను దిగుమతి చేసుకుంటామని ఆయన వెల్లడించారు.
More Stories
బీహార్ లో అన్ని ఎన్నికల రికార్డ్లను బ్రేక్ చేస్తాం
బెంగాల్ లో 1000కి పైగా పౌరసత్వ శిబిరాల ఏర్పాట్లలో బీజేపీ
కర్నూలు జిల్లాలో బస్సుకు దగ్ధంలో 19 మంది సజీవ దహనం