
పాకిస్తాన్ సైన్యంలో పెరుగుతున్న అశాంతి, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై తిరుగుబాటు పాకిస్తాన్‌లో రాజకీయ అస్థిరత పెరిగిన మయంలో కలకలం రేపుతున్నాయి. ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ రాజీనామా చేయాలని జవాన్లు, అధికారి స్థాయి వ్యక్తులు డిమాండ్ చేస్తున్నారు. అతను పదవి నుంచి తప్పుకోకపోతే సైనిక తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌పై జవాన్లు, కెప్టెన్, మేజర్, కల్నల్ స్థాయి అధికారులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆసీమ్ మునీర్ నాయకత్వ వైఫల్యాలపై ఓ లేఖ రాస్తూ ఆర్మీ పాలనను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఆసిమ్ మునీర్‌ను తొలగించాలనే డిమాండ్ స్వయంగా ఆఫీసర్లు తిరుగుబాటు చేయడంతో అత్యంత క్లిష్ట పరిణామం తలెత్తింది.
తన సైనిక అధికారాన్ని రాజకీయ అసమ్మతిని అణచివేసేందుకు, జర్నలిస్టుల నోరు మూసివేసేందుకు, రాజకీయ పక్రియను అడ్డుకొనేందుకు దుర్వినియోగ పరుస్తున్నారని ఆరోపించారు. అతను రాజీనామా చేయని పక్షంలో తాము బలప్రయోగం ఉపయోగించడం ద్వారా చర్య తీసుకోవలసి ఉంటుందని హెచ్చరించారు.
పాకిస్తాన్ ఆర్మీలో తిరుగుబాటు జరగడం తక్కువగా చూసే విషయమేమీ కాదు. అయితే, ఈసారి అధికారిక స్థాయిలోనూ తిరుగుబాటు రూపుదిద్దుకుంది.
ఆసిమ్ మునీర్ నాయకత్వం పాకిస్తాన్‌ను ప్రమాదంలోకి నెట్టిందని, ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరతను తలతిప్పుకునేలా చేశాడని ఆరోపణలు తలెత్తుతున్నాయి.
రాజకీయ అస్థిరతను తలతిప్పుకునేలా చేశాడని, ప్రభుత్వం మద్దతుగా వ్యవహరిస్తూ, ప్రజాస్వామ్యాన్ని నీరుగార్చుతున్నాడని విమర్శలు చెలరేగుతున్నాయి. పాకిస్తాన్ చరిత్రను పరిశీలిస్తే, ఆర్మీ తిరుగుబాట్లతో ప్రభుత్వాలను కూల్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 1958లో అయూబ్ ఖాన్ తిరుగుబాటు, 1977లో జనరల్ జియా-ఉల్-హక్ పాలన స్వీకరించడం,1999లో ముషారఫ్ నవాజ్ షరీఫ్‌ను కూల్చడం తెలిసిందే.
ఇప్పుడు మళ్లీ ఆర్మీలో అంతర్గత అంతరం పెరుగుతుండటం పెద్ద పరిణామమే. ఆసిమ్ రాజీనామా చేస్తారా? లేక తిరుగుబాటు ఎదుర్కొంటారా? సైనిక అధికారుల తిరుగుబాటు వల్ల ప్రభుత్వంపై కూడా ప్రభావం? ఇంతకుముందు మాదిరిగా మళ్లీ సైనిక పాలన వస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
అవినీతిపై పోరాడతా, ఉద్యోగాలు కల్పిస్తా