
అంతర్గత విచారణలో ఆయన (జస్టిస్ వర్మ) దోషిగా తేలితే ఎఫ్ఐఆర్ నమోదుకు కానీ, పదవి నుంచి తొలగించాలని ప్రభుత్వానికి సిఫారసు చేయడం కానీ జరుగుతుందని ధర్మాసనం తెలిపింది. ప్రస్తుతం ఇన్-హౌస్ ఎంక్వయిరీ జరుగుతున్నందున నివేదిక అనంతరమే ఏమి చేయాలనే దానిపై చాలా అప్షన్లు ఉంటాయని సుప్రీం ధర్మాసనం పేర్కొంటూ పిటిషన్ను కొట్టివేసింది.
జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలపై అంతర్గత విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని మార్చి 22న భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నియమించారు. త్రిసభ్య కమిటీ జస్టిస్ వర్మను ఈ వారంలో కలిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో లుథేన్స్ ఢిల్లీ నివాసానికి వచ్చిన న్యాయమూర్తులు సిద్ధార్థ్ అగర్వాల్, మనేక గురుస్వామి, అరుంధటి కట్జు, తారా నరూలాను న్యాయసలహాల కోసం జస్టిస్ వర్మ సంప్రదించినట్టు తెలుస్తోంది.
తుగ్లక్ క్రిసెంట్లోని జస్టిస్ వర్మ నివాసాన్ని ఇటీవల త్రిసభ్య కమిటీ సందర్శించింది. జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు తిప్పిపంపాలని సుప్రీంకోర్టు కొలిజియం ఇటీవల సిఫారసు చేసింది. అయితే, ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడాన్ని అలబాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ వ్యతిరేకించింది. న్యాయవ్యవస్థపై నమ్మకం పెంచేదుకు జస్టిస్ వర్మపై సమగ్ర దర్యాప్తు జరపాలని, అభిశంసనకు సిఫారసు చేయాలని బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. వర్మ పాత కేసుల్లో తీర్పులను కూడా పునఃసమీక్షించాలని కోరింది.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్గా అర్షదీప్
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు