
ఖార్ ప్రాంతంలోని హాబిటాట్ కామెడీ క్లబ్‌లో కునాల్ కమ్రా షో జరిగింది. షోలో భాగంగా కమ్రా మహా రాజకీయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఉపముఖ్యమంత్రి ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ దేశ ద్రేహి అని పేర్కొన్నారు.
“శివసేన నుంచి శివసేన బయటికి వచ్చింది. ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయింది. అంతా గందరగోళంగా ఉంది” అంటూ మహారాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడారు. అక్కడితో ఊరుకోకుండా ఆ కమెడియన్ ఏక్‌నాథ్ షిండేను ద్రోహిగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ‘దిల్ తో పాగల్ హై’ అనే హిందీ పాటలోని చరణాలను రాజకీయాలకు అనుగుణంగా మార్చి అవమానకర రీతిలో పాడారు.
ఇందుకు సంబంధించిన వీడియోను శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఎక్స్‌లో పోస్టు చేస్తూ ‘కునాల్ కా కమల్’ అంటూ ఎద్దేవా చేశారు. దీంతో ఈ అంశం కాస్తా వివాదాస్పదమైంది. కమెడియన్‌పై శివసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు షో జరిగిన హోటల్‌పై దాడి చేశారు. కమ్రా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ దాడికి పాల్పడ్డారు. అప్రమత్తమైన పోలీసులు ఈ దాడికి నేతృత్వం వహించిన శివసేన నేత రాహుల్ కనాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో 40 మంది కార్యకర్తలపై కేసు నమోదు చేశారు.
మరోవైపు డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కమెడియన్‌పై శివసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కమ్రాపై కేసు నమోదు చేసి 12 మందిని అరెస్ట్ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో తమ క్లబ్‌ను మూసివేస్తున్నట్లు హాబిటాట్ స్టూడియో ప్రకటించింది. కాగా, ది హాబిటాట్ స్టూడియోలో జరిగిన విధ్వంసానికి సంబంధించి అరెస్టయిన 12 మంది వ్యక్తులకు ఆదివారం బాంద్రాలోని మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీరిలో శివసేన (షిండే వర్గం) నాయకుడు రాహుల్ కనాల్ కూడా ఉన్నారు.
మరోవైపు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా దీనిపై అసహనం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నియమాలకు వ్యతిరేకంగా ఎవరకూ ప్రవర్తించకూడదని, రాజ్యాంగం కల్పించిన హక్కులకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. అంతేకాక చట్టం పరిధి దాటి ఎవరు వ్యవహరించకూడదని హెచ్చరించారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు