
ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్న ఉల్లిపాయలపై 20 శాతం ఎగుమతి సుంకాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఎగుమతులను పెంచడం, ధరలను స్థిరీకరించడం లక్ష్యంగా సుంకాన్ని ఎత్తివేసినట్లు శనివారం రెవెన్యూ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని (2023 డిసెంబర్‌లో విధించిన) కేంద్రం గతేడాది మేలో రద్దు చేసిన సంగతి తెలిసిందే. కానీ 40శాతం ఎగుమతి సుంకంతో పాటు టన్నుకు 550 డాలర్ల కనీస ఎగుమతి ధర (ఎంఇపి)ని ప్రవేశపెట్టింది. గతేడాది సెప్టెంబర్‌లో ఎగుమతి సుంకాన్ని 20 శాతానికి తగ్గిస్తూ, ఎంఇపిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ పరిమితులతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉల్లి ఎగుమతులు 1.16 మిలియన్ టన్నులకు మాత్రమే చేరుకున్నాయి. గతేడాది ఉల్లి ఎగుమతులు 1.71 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ 473.7 మిలియన్ డాలర్ల విలువైన ఉల్లిని ఎగుమతి చేసింది.
ముఖ్యంగా బంగ్లాదేశ్‌కు – 40శాతం, మలేషియా 14 శాతం, శ్రీలంక 10 శాతం, యుఎఇ 9శాతం, నేపాల్ 4 శాతం, ఇతర పొరుగు రాష్ట్రాలకు 18శాతం ఎగుమతి అయ్యాయి. అయితే 2023 డిసెంబర్‌లో భారత ప్రభుత్వం ఎగుమతి నిషేధం విధించిన తర్వాత, నెలవారీ ఉల్లి ఎగుమతుల విలువ 2023 నవంబర్‌లో 100 మిలియన్ డాలర్ల నుండి 2024 జనవరిలో కేవలం 11 మిలియన్ డాలర్లకు పడిపోయింది. దీంతో పాకిస్థాన్ మార్కెట్ వాటా నష్టపోయింది.
మార్కెట్లోకి రబీ పంట రాకతో, పెరిగిన సరఫరా ధరలను మరింత తగ్గించే అవకాశం ఉందని, ఇది రైతుల ఆదాయాలను తగ్గించి, మరింత ఇబ్బందులకు గురిచేస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఎగుమతి సుంకం తొలగింపు చర్య ధరలలో తగ్గుదలను నివారిస్తుందని, ఎగుమతులను పెంచుతుందని, మార్కెట్లో స్థిరత్వాన్ని నిర్థారిస్తుందని లాసల్గావ్‌లోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఎపిఎంసి) డైరెక్టర్ జయదత్ హోల్కర్ పేర్కొన్నారు.
శనివారం ఉల్లి రిటైల్ ధర కేజీ రూ.30కి తగ్గిందని, గత నెల కేజీ రూ.40గా ఉందని వినియోగదారుల వ్యవహారాల విభాగం పేర్కొంది. 2024-25 పంట సంవత్సరానికి రబీలో ఉల్లి ఉత్పత్తి గతేడాది పంట సంవత్సరం కంటే 22.7 మెట్రిక్ టన్నులు (18 శాతం ఎక్కువ) అధికంగా ఉంటుందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.
భారతదేశ మొత్తం ఉల్లి ఉత్పత్తిలో రబీ ఉల్లి పంట వాటా 70-75 శాతం వాటా కలిగి ఉంది. అక్టోబర్‌లో ఖరీఫ్ పంట వచ్చేవరకు సరఫరాను స్థిరంగా ఉంచుతుంది. అధిక తేమ స్థాయిలను కలిగి ఉండే ఖరీఫ్ ఉల్లి పంట మొత్తం ఉత్పత్తిలో 25 శాతం మాత్రమే వాటా కలిగి ఉంటుంది. దీంతో మార్చి వరకు దేశీయ డిమాండ్‌కు అనుగుణంగా నేరుగా మార్కెట్‌కు తరలిస్తారు.
More Stories
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు