`దేవి అహల్యకి పుణ్య గాధ’ నాటిక ప్రదర్శన రేపే

`దేవి అహల్యకి పుణ్య గాధ’ నాటిక ప్రదర్శన రేపే

ధర్మ పరిరక్షకురాలు అహల్య దేవి 300వ జయంతి వేడుకలను పురస్కరించుకుని అహల్య దేవి జీవిత చరిత్రను ప్రజలకు పరిచయం చేసే ఉద్దేశంతో ఈనెల 23న హైదరాబాద్ నగరంలో “రాష్ట్ర సమర్థ – దేవి అహల్యకీ పుణ్యగాధ” పేరిట నాటిక ప్రదర్శించనున్నారు. 

కుటుంబ విలువల పరిరక్షణే ధ్యేయంగా విశ్వమాంగల్య సభ ఆధ్వర్యంలో నగరంలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఈ నాటిక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని విశ్వ మాంగళ్య సభ జాతీయ సహా సంఘటన కార్యదర్శి గాయత్రి లోమ్టే, హైదరాబాద్ నగర అధ్యక్షురాలు బి.శృతి, కార్యదర్శి డాక్టర్ పి. ఆశాజ్యోతి, సమన్వయకర్త డాక్టర్ పూనమ్ నోముల్వార్ వెల్లడించారు. 

సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రారంభమయ్యే ప్రదర్శనకు పారిశ్రామికవేత్త భగవతిజీ మహేష్  బల్డ్వా,  సంస్థ జాతీయ ఉపాధ్యక్షురాలు నళిని హావ్రే  తదితరులు హాజరుకానున్నారని చెప్పారు. నాగపూర్ కి చెందిన 45 మంది కళాకారుల బృందం ఈ నాటికను ప్రదర్శించనున్నట్లు తెలిపారు.  దేశంలోని 51 ప్రాంతాల్లో నాటిక ప్రదర్శించనున్నారని, ఇప్పటికే 21 ప్రాంతాల్లో ప్రదర్శనలు పూర్తయ్యాయని గుర్తు చేశారు.

“ఏక్ శ్యామ్ .. దేశ్ కే నామ్” ట్యాగ్ లైన్ తో నిర్వహించనున్న నాటిక ప్రదర్శనకు కుటుంబ సమేతంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. దేశంలో జ్యోతిర్లింగాల పునర్నిర్మాణం, ఆలయాల అభివృద్ధి, ధర్మ పరిరక్షణకు  అహల్యా దేవి చేసిన కృషి, ఆ మహనీయురాలి జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని వారు తెలియజేశారు.