 
                కృష్ణానది ప్రాజెక్టులపై కేంద్రం నోటిఫికేషన్‌ను ప్రశ్నిస్తూ తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ పై కేంద్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ అయ్యాయి. కృష్ణా పరీవాహకంలోని ప్రాజెక్టులన్నీ కేఆర్‌ఎంబీకి అప్పగించాలని 2021లో కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.
దీనిని సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసింది. మరోవైపు కేఆర్ఎంబీ ప్రాజెక్టులపై అధిక విద్యుత్ ఉత్పత్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పిటిషన్ వేసింది. ఈ జీవో సాయంతో అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని వాడుకుంటున్నారని ఏపీ సర్కార్ తమ పిటిషన్లో ఆరోపించింది.
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో రద్దు చేయాలని పిటిషన్లో కోరింది. దీంతో సర్వోన్నత న్యాయస్థానం ఏపీ, తెలంగాణ వేసిన పిటిషన్లను కలిపి విచారణ చేపట్టింది. మరోవైపు 2021లో కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వాలని తెలంగాణ మరో పిటిషన్ వేసింది. స్టే ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్లపై 2 వారాల్లో కౌంటర్ దాఖలు వేయాలని కేంద్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇవి రెండు కౌంటర్లు దాఖలు చేసిన వారంలోగా రిజాయిండర్ ఫైల్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది.





More Stories
చిత్తూర్ మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష
భగవద్గీతపై టిటిడి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యల దుమారం
మొంథా తుపాను ప్రాథమిక నష్టం రూ.5265 కోట్లు