
యూనివర్శిటీ ప్రాంగణంలో నమాజ్ చేయడంతో పాటు ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన ఒక విద్యార్థిని యుపి పోలీసులు అరెస్ట్ చేశారు. మీరట్‌లోని ఐఐఎంటి యూనివర్శిటీలో గత శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఐఐఎంటి యూనివర్శిటీ ప్రాంగణంలో కొందరు విద్యార్థులు నమాజ్ చేస్తున్న వీడియోను ఖలీద్ ప్రధాన్ (ఖలీద్ మేవతి) సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ వీడియోపై స్థానిక హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఖలీద్ ప్రధాన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. యూనివర్శిటీ ప్రాంగణంలో నమాజ్ చేస్తున్న వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి, మత విద్వేషాలను రెచ్చగొట్టినందుకు ఖలీద్‌ను అదుపులోకి తీసుకున్నామని సర్కిల్ ఆఫీసర్ ప్రతాప్ సింగ్ తెలిపారు.
కార్తీక్ హిందూ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు శనివారం గంగానగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బిఎన్‌ఎస్ సెక్షన్ 299, ఐటి (సవరణ) చట్టం, 2008లోని సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేశామని తెలిపారు.
బహిరంగ ప్రదేశంలో నమాజ్ చేయడంతో పాటు మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఆ వీడియోను సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేసినట్లు దర్యాప్తులో తేలిందని ఐఐఎంటి యూనివర్శిటీ ప్రతినిధి సునీల్ శర్మ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఖలీద్‌తో పాటు ముగ్గురు భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
More Stories
ఢిల్లీలో మాత్రమే బాణాసంచాపై నిషేధం విధించాలా?
ఢిల్లీ, ముంబై హైకోర్టులకు బాంబు బెదిరింపులు
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు