జమిలి ఎన్నికలు అన్ని విధాలుగా అందరికీ మేలు

జమిలి ఎన్నికలు అన్ని విధాలుగా అందరికీ మేలు

జమిలి ఎన్నికలు అన్ని విధాలుగా అందరికీ మేలన్న విషయం గ్రహించాలని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా హితవు పలికారు. విజయవాడలో బిజెపి ఆధ్వర్యంలో జరిగిన సోషల్ మీడియా ప్రభావంతుల సదస్సులో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ సమాజ అభివృద్ధికి దేశానికి ఒకే ఎన్నిక ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, రాజకీయ పార్టీలకు కూడా ఎంతో మేలు కలిగిస్తుందని చెప్పారు.

వృధాకు కళ్ళెం వేసి ప్రగతి కి బీజం పడుతుంతుందని పేర్కొంటూ ఒకే దేశం ఒకే ఎన్నిక కొత్త కాదని, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మూడు పర్యాయాలు దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు.  స్వీడన్ తో సహా పలు దేశాల్లో ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. 1983లో ఎన్నికల కమిషన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదన లు తీసుకొచ్చిన విషయాన్ని ఆయన వివరించారు 

ఆ తర్వాత సుమారు ఆరు నివేదికలు జాతీయ స్థాయిలో ఒకేసారి ఎన్నికలను నిర్వహించాలని ప్రతిపాదనలు చేస్తే ఎందుకు ఎవరూ విభేదించలేదని ఆయన ప్రశ్నించారు. దేశాభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఈ విషయంలో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

తమిళనాడు ప్రభుత్వం హిందీ భాషా వివాదం విషయంలో సోషల్ మీడియా సభ్యులు ప్రశ్నలకు సమాధానంగా షెహజాద్ పూనావాలా స్టాలిన్ కేవలం రాజకీయ పరమైన విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. స్టాలిన్ పేరు రష్యా స్థానికతను సూచిస్తుందని,  తమిళ సై, అన్నామలై పేర్లు తమిళనాడు స్థానికతను సూచిస్తుందని చెబుతూ కాంగ్రెస్ కు అంటకాగుతున్న డిఎంకె కేవలం హిందీ విషయాన్ని రాజకీయం చేస్తుందని మండిపడ్డారు.

2011లో హిందీ భాష పైన వేసిన కమిటీపై కరుణానిధి సమర్థత తెలియచేస్తే తాజాగా స్టాలిన్ అభ్యంతరం ఎలా తెలియ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నప్పుడు డిఎంకె చెవులు మూసుకుని ఇప్పుడు అరిస్తే లాభం ఏంటని దుయ్యబట్టారు. 
2010లో రూపీ సింబల్ తమిళనాడు కు చెందిన వ్యక్తి రూపొందించిన విషయం స్టాలిన్ మరిచారని ఎద్దేవా చేశారు.  సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ అడుసుమిల్లి కేశవ్ కాంత్ అధ్యక్షత వహించారు.