ఆ సమయంలో డీకే అరుణ ఇంట్లో లేరు. మీటింగ్ కోసం మహబూబ్నగర్ వెళ్లారు. ఆగంతకుడు గంటన్నర పాటు కిచెన్లో ఉన్నాడు. ఎంపీ గది వరకు వెళ్లాడు. ఇంట్లో ఎలాంటి వస్తువులు పోలేదు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశామని డ్రైవర్ లక్ష్మణ్ తెలిపారు.
నిందితుడు గతంలో అదే ఇంట్లో వంటమనిషిగా పనిచేసిన అమిత్గా అనుమానిస్తున్నారు. అమిత్ బిహార్ వాసి. కొన్ని నెలల క్రితం అతడిని పనిలో నుంచి తీసివేశారు. ఈ మేరకు పోలీసులు నిందితుడి వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డీకే అరుణ తెలిపారు. తనకు, తన కుటుంబానికి ప్రభుత్వం భద్రత పెంచాలని ఆమె డిమాండ్ చేశారు.
గతంలో తన కుటుంబంపై జరిగిన దాడిని దృష్టిలో ఉంచుకొని, అన్ని అంశాలు పరిశీలించి తమ కుటుంబానికి భద్రత పెంచాలని ఆమె కోరారు. మరోవైపు ఈ ఘటనపై అరుణకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేసి ఆరా తీశారు. పోలీస్ ఉన్నతాధికారులకు బండి సంజయ్ ఫోన్ చేసి డీకే అరుణకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలని కోరారు.

More Stories
ఏఐ టెక్నాలజీతో రెండు గంటల్లోనే తిరుమలలో దర్శనం
కాంగ్రెస్ లేకుంటే ముస్లింలకు దిక్కులేదా రేవంత్ రెడ్డి!
జూబ్లీ హిల్స్ లో ఓట్ల చీలికతో బీజేపీ ‘కింగ్’