ఆత్మాహుతి దాడిలో గాయపడిన సైనికులను హెలికాప్టర్లతో చికిత్స కోసం ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఆ ప్రాంతంలో పర్యవేక్షణ కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు. కాగా, సైనిక కాన్వాయ్‌పై దాడికి బాధ్యత వహిస్తూ బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఆత్మాహుతి విభాగం ది మజీద్ బ్రిగేడ్ ఓ ప్రకటన విడుదల చేసింది.
‘‘ కొద్ది గంటల కిందట నిష్కోలోని ఆర్సీడీ హైవేపై ఉన్న రఖ్షాన్ మిల్ సమీపంలో పాకిస్థాన్ సైన్యంపై బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఆత్మాహుతి విభాగం ది మజీద్ బ్రిగేడ్ ఆత్మాహుతి దాడి చేసింది. కాన్వాయ్‌లో మొత్తం 8 బస్సులు ఉండగా పేలుడు తీవ్రతకు ఒకటి పూర్తిగా ధ్వంసమైంది’’ అని బీఎల్ఏ పేర్కొంది. “ఈ దాడి తర్వాత బీఎల్ఏకు చెందిన మరో టీమ్ ఫతేహ్ స్వ్యాడ్ ఇంకో బస్సును చుట్టుముట్టింది. అందులోని ఉన్న సైనికులందరూ కాల్పుల్లో హతమయ్యారు. శత్రువులు 90 మంది హతమయ్యారు” తెలిపింది.

More Stories
భారత్, అమెరికాల మధ్య 10 ఏళ్ల రక్షణ ఒప్పందం
చాబహార్ పోర్ట్‌పై అమెరికా ఆంక్షల నుండి తాత్కాలిక ఊరట
అమెరికాలో వర్క్ పర్మిట్ ఆటోమేటిక్ రెన్యువల్ రద్దు