
ఢిల్లీ, బీజింగ్ మధ్య మెరుగైన సంబంధాలు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ సౌత్ దేశాలకు కూడా ప్రయోజనమని పేర్కొన్నారు. అంతర్జాతీయ సంబంధాల్లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసి, అంతర్జాతీయ వేదికలపై గ్లోబల్ సౌత్ (పేద దేశాల) స్థానాన్ని శక్తిమంతం చేస్తుందని తెలిపారు. ఇరుదేశాల మధ్య వివాదాలను దౌత్య మార్గంలో పరిష్కరించుకొంటామని సూచించారు.
సమష్టి ప్రయోజనాలను కాపాడుకోవడానికి సహకారం అవసరమని వాంగ్ చెప్పారు. చర్చల ద్వారా పరిష్కారం కానీ సమస్యే లేదని, అదే సమయంలో సహకారంతో చేరుకోలేని లక్ష్యాలు కూడా లేవని వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో జరిగిన జీ20 విదేశాంగ మంత్రుల భేటీలో భారత మంత్రి జైశంకర్‌తో చైనా మంత్రి వాంగ్ యీ భేటీ అయ్యారు.
ఆ తర్వాత కొన్ని వారాల్లోనే ఈ ప్రకటనలు వెలువడ్డాయి. వాస్తవానికి 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు అట్టడుగు స్థాయికి పడిపోయాయి. ఆ తర్వాత పలు విడతలుగా ఇరుదేశాలకు చెందిన దౌత్యవేత్తలు, సైనికాధికారులు చర్చలు జరిపారు.
2024లో ప్రధాని మోదీ -చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బ్రిక్స్ సదస్సు సందర్భంగా కజాన్‌లో భేటీ అయ్యారు. ఆ తర్వాతనే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్నచోట్ల నుంచి ఇరుదేశాల బలగాలు వెనక్కి తగ్గి పాత స్థితికి చేరుకొన్నాయి. మరోవైపు ఈ ఏడాది చైనా షాంఘై సహకార సంస్థ సమావేశాలకు ఆతిథ్యం ఇస్తోంది. భారత ప్రధాని మోదీ అందులో పాల్గొనడం అత్యంత కీలకంగా మారనుంది.
More Stories
ఆసియాన్ సదస్సులో వర్చువల్ గా మోదీ
రష్యా చమురు సంస్థలపై ట్రంప్ ఆంక్షలు
మహిళల కోసం జైషే ఆన్ లైన్ ‘జీహాదీ కోర్స్’