
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల భారతీయ ప్రతినిధి సభలో ఈ సంవత్సరం బెంగళూరులో మార్చి 21-22- 23 తేదీలలో జరుగుతాయని అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు. సంఘ వ్యవస్థలో అత్యున్నత నిర్ణయం తీసుకునే వేదికగా పరిగణించే ఈ సమావేశంను ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు.
బెంగళూరులోని చన్నెనహళ్లిలో ఉన్న జనసేవ విద్యా కేంద్రం ప్రాంగణంలోజరిగే ఈ సమావేశంలో సంఘ్ గత సంవత్సరం (2024-25) వార్షిక నివేదికను చర్చిస్తారు. దానిపై విమర్శనాత్మక విశ్లేషణతో పాటు, ప్రత్యేక కార్యక్రమాలపై నివేదిక కూడా సమర్పిస్తారు. రాబోయే విజయదశమి 2025కు సంఘ పని వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. ఈ కారణంగా, విజయదశమి 2025 నుండి 2026 వరకు సంఘ్ శతాబ్ది పూర్తి సంవత్సరంగా పరిగణించబడుతుంది.
ఈ సమావేశంలో శతాబ్ది సంవత్సరం పురోగతిని సమీక్షించడంతో పాటు, రాబోయే సంవత్సరానికి వివిధ కార్యక్రమాలు, ప్రచారాల ప్రణాలికను తయారు చేస్తారు. జాతీయ సమస్యలపై రెండు తీర్మానాలను పరిశీలిస్తారు. అలాగే, సంఘ శాఖల నుండి ఆశించినట్లుగా, సామాజిక మార్పు పని, ముఖ్యంగా పంచ పరివర్తన్ ప్రయత్నాల గురించి చర్చిస్తారు.
హిందూ మేల్కొలుపు అంశంతో పాటు, దేశంలోని ప్రస్తుత దృష్టాంతం విశ్లేషణ, తదుపరి కార్యకలాపాలపై చర్చలను సమావేశాల ఎజెండాలో చేర్చారు. సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే లతో పాటు, అందరు సహ-సర్ కార్యవాహులు, ఇతర కార్యనిర్వాహకులు, కార్యనిర్వాహక సభ్యులందరూ ఈ సమావేశంలో పాల్గొంటారు.
మొత్తం 1500 మంది కార్యకర్తలు, ప్రధానంగా ప్రాంత, క్షేత్ర స్థాయిల నుండి ఎన్నికైన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారని భావిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ప్రేరేపిత సంస్థల జాతీయ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు కూడా పాల్గొంటారు.
More Stories
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం
నవంబర్ 25న పూర్తి కానున్న అయోధ్య రామాలయం
ఐపీఎస్ అధికారి పూరన్ ఆత్మహత్యపై సిట్