
**EDS: THIRD PARTY
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్ఎస్ సి) టెర్రర్ బ్లాక్‌లిస్ట్ ప్రక్రియలో మరింత పారదర్శకత ఉండాలని కోరుతూ, “మారువేషంలో వీటో” అనే పదంతో దాని ప్రస్తుత విధానాన్ని భారత్ విమర్శించింది. ఉగ్రవాద సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడంపై గోప్యత ఉండడం, ఎంపిక చేసిన కొన్ని దేశాలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం పై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
భారత శాశ్వత ప్రతినిధి పి. హరీష్, భద్రతా మండలి అనుబంధ సంస్థల పనితీరుపై సంస్కరణలు కోరారు. ఉగ్రవాద సంస్థలను జాబితాలో చేర్చడాన్ని తిరస్కరించే దేశాలు తమ నిర్ణయాల వెనుక కారణాలను బహిరంగంగా వెల్లడించట్లేదు. నిర్ణయాలను గోప్యంగా ఉంచడం వల్ల కొన్ని దేశాలు ఉగ్రవాద సంస్థలను రక్షించే అవకాశం పొందుతున్నాయని ఆందోళన వ్యకతం చేశారు.
భద్రతా మండలిలో కొన్ని దేశాలు, ముఖ్యంగా చైనా, పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాదులను జాబితాలో చేర్చడాన్ని అడ్డుకుంటున్నాయి. భద్రతా మండలి అనుబంధ కమిటీ అయిన 1267 అల్-ఖైదా ఆంక్షల కమిటీ పనితీరుపై భారతదేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలను బ్లాక్‌లిస్ట్ చేయాలని భారతదేశం చేసిన ప్రయత్నాలు పలుమార్లు విఫలమయ్యాయి.
భద్రతా మండలి పనితీరును మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ప్రపంచ దేశాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. భద్రతా మండలి ప్రపంచ శాంతి భద్రతలకు కీలకంగా మారిన సమయంలో, సరైన జోక్యం చేసుకునే సామర్థ్యం పెరగాలని భారత్ అభిప్రాయపడింది. భద్రతా మండలిలో సంస్కరణలు కేవలం చర్చలకే పరిమితం కాకుండా, అవి సమయ పరిమితితో ముందుకు సాగాలని భారతదేశం స్పష్టం చేసింది.
భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద శాంతి పరిరక్షక దళాలను అందించేవారిలో ఒకటి. భారత శాంతి పరిరక్షక బలగాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, భద్రతా మండలి పనితీరులో మార్పులు తీసుకురావాలని కోరింది.
More Stories
కాబూల్‌పై పాకిస్థాన్ బాంబుల వర్షం… టీటీపీ చీఫ్ హతం?
మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి
హంగేరియన్ రచయితకు సాహిత్య నోబెల్