బీహార్ లో మంత్రులుగా మరో ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు

బీహార్ లో మంత్రులుగా మరో ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు

abinబీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ బుధవారం తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఈ ఏడాది నవంబర్‌లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఇప్పుడు సీఎం నితీశ్‌ తన క్యాబినెట్‌ను విస్తరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొత్తగా నితీశ్‌ క్యాబినెట్లో చేరిన ఏడుగురు. 

బీజేపీ ఎమ్మెల్యేల్లో సంజయ్‌ సరోగి, సునీల్ కుమార్‌, జిబేశ్‌ మిశ్రా, మోతీలాల్‌ ప్రసాద్‌, క్రిషన్‌ కుమార్‌ మాంటూ, రాజు కుమార్‌ సింగ్‌, విజయ్‌ కుమార్‌ మండల్‌ ఉన్నారు. వారందరూ బుధవారం సాయంత్రం 4 గంటలకు మంత్రులుగా ప్రమాణ స్వీకారాలు చేశారు. బీహార్‌ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ వారి చేత ప్రమాణస్వీకారాలు చేయించారు.

ఇటీవల బీహార్ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి దిలీప్‌ జైస్వాల్‌ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఒక వ్యక్తికి ఒకే పదవి అనే పార్టీ పాలసీకి అనుగుణంగా తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఆరుగురు నూతనంగా మంత్రులుగా ప్రమాణం చేసినందున జైస్వాల్‌ రాజీనామా చేస్తే బీహార్‌ మంత్రి వర్గంలో మొత్తం ఆరుగురు మంత్రులు పెరగనున్నారు.

ఇప్పుడు, మంత్రివర్గం సంఖ్య 30కి చేరుకుంది, అందులో బిజెపి నుండి 15, జెడి(యు) నుండి 13, హిందూస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) నుండి ఒకరు,  స్వతంత్రుల నుండి ఒకరు ఉన్నారు. ఆరు సీట్లు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. బుధవారం మంత్రివర్గంలో చేరిన తర్వాత, దాని మొత్తం బలం 37కి చేరుకుంది.