మరో ఐదు రోజుల్లో పీఎం కిసాన్ నిధుల విడుదల

మరో ఐదు రోజుల్లో పీఎం కిసాన్ నిధుల విడుదల
ప్రతీ ఏటా అన్నదాతలకు పెట్టుబడి సాయంగా సర్కారు అందిస్తున్న పీఎం కిసాన్ నిధులను త్వరలోనే విడుదల చేయబోతుంది.  పీఎం కిసాన్ 19వ విడుత నిధులను  ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం రోజున నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే విడదల చేయబోతున్నారు. ఈక్రమంలోనే ఎకరానికి రూ. 2,000 చొప్పున డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి.

బిహార్‌లోని భాగల్పూర్‌లో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనబోతున్న ప్రధాని మోదీ అక్కడే 9.7 కోట్ల మంది అన్నదాతలకు ప్రయోజనం చేకూర్చబోతున్నారు. ఎకరానికి రూ.2 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయబోతున్నారు. అయితే పీఎం కిసాన్ పథకం కింద డబ్బులు అందుకోవాలనుకుంటే రైతులు ఎన్‌పీసీఐ, ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంకు ఖాతాను కల్గి ఉండాలి. అంతేకాకుండా ఇ-కేవైసీ చేసి ఉండాలి. 

 
ఇప్పటి వరకు మొత్తంగా 18 విడతల్లో కేంద్ర ప్రభుత్వం రైతులకు పీఎం కిసాన్ నిధులను అందించగా, చివరి సారిగా 2024 అక్టోబర్ 15వ తేదీన డబ్బును అన్నదాతల ఖాతాల్లో జమ చేశారు. ఈ పథకం ద్వారా ప్రతీ ఏడాది రైతులకు రూ.6 వేల పెట్టుబడి సాయం అందుతోంది. ముఖ్యంగా మూడు విడతల్లో ఎకరానికి 2 వేల రూపాయల చొప్పున జమ చేస్తున్నారు. 
 
మొదట్లో డబ్బులు వచ్చి ఇప్పుడు పొందలేకపోతున్న వారు వెంటనే పీఎం కిసాన్ పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా ఈ కేవీసీని పూర్తి చేయాలి. లేదంటే కామన్ సర్సీసెస్ సెంటర్ల ద్వారా బయోమెట్రిక్ కేవైసీని చేయించుకోవాలి. లేని పక్షంలో డబ్బులు రావు.  ఇవన్నీ చేసిన కొంత మందికి మాత్రం డబ్బులు రావు.
 
వాళ్లలో ప్రధానంగా రాజ్యాంగపరమైన పోస్టుల్లో ఉన్నవారు, గతంలో సేవలు అందించిన వారు ఉంటారు. మాజీ, ప్రస్తుత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జిల్లా పంచాయతీ ఛైర్మన్లు సహా కేంద్ర, రాష్ట్ర ప్రభత్వ ఉద్యోగులు, కంపెనీలు, ఆటోనమస్ బాడీ, లోకల్ బాడీ ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు.