
సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలోకి విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు రానున్నాయి. విశాఖ కేంద్రంగా ఏర్పాటైన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలను 410 కిలోమీటర్లుగా నిర్ణయించింది. ఇండియన్ రైల్వే మంత్రిత్వ శాఖ వాల్తేరు డివిజన్ పేరును విశాఖగా మార్చింది. గతంలో వాల్తేరులో ఉన్న ఏపీ రైల్వే స్టేషన్లను విశాఖకు బదిలీ చేసింది.
కొండపల్లి – మొటుమర్రి సెక్షన్‌ను సికింద్రాబాద్ డివిజన్ నుంచి విజయవాడ డివిజన్‌గా మారుస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలోకి విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు రానున్నాయి. రాయగడ రైల్వే డివిజన్ పరిధిని కూడా ఖరారు చేస్తూ నేడు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
విశాఖ డివిజన్‌లో 410కిలోమీటర్లు పరిధిని చేర్చారు రైల్వే అధికారులు. రాయగడ రైల్వే డివిజన్‌లోని కొన్ని మార్గాలను విశాఖపట్నం రైల్వే డివిజన్ పరిధిలోకి తీసుకొచ్చారు. రెండు డివిజన్ల పరిధిని ఖరారు చేశారు. విశాఖ రైల్వే డివిజన్‌ను కొత్తగా ఏర్పాటు చేయడంతో సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలోకి దాన్ని మార్చేశారు.
విశాఖ రైల్వే డివిజన్‌లో పలాస నుంచి విశాఖపట్నం దువ్వాడ, కూలేరు నుంచి విజయనగరం, నవపాడు జంక్షన్ వరకు.. సింహాచలం నార్త్ నుంచి దువ్వాడ బైపాస్ వరకు.. వడ్లపూడి నుంచి దువ్వాడ-విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వరకు రైల్వే ట్రాక్ మొత్తం విశాఖ రైల్వే డివిజన్‌లోకి వస్తుందని కేంద్రం పేర్కొంది. రాయగడ రైల్వే డివిజన్‌లోని కొన్ని మార్గాలను విశాఖపట్నం రైల్వే డివిజన్ పరిధిలోకి తీసుకొచ్చారు. రెండు డివిజన్ల పరిధిని ఖరారు చేశారు.
విశాఖ రైల్వే డివిజన్‌ను కొత్తగా ఏర్పాటు చేయడంతో సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలోకి దాన్ని మార్చేశారు. ఇంతకు ముందు గుంటూరు, గుంతకల్లు, విజయవాడ రైల్వే డివిజన్‌లు సౌత్ ఇంట్రన్ రైల్వే పరిధిలో ఉండేవి.. ఇప్పుడు వీటన్నింటినీ సౌత్ కోస్టల్ రైల్వే పరిధిలోకి తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం.
More Stories
దేవరగట్టు కర్రల సమరంలో ఇద్దరు మృతి
భారతీయ ఉత్పత్తులకు గ్లోబల్ సంతగా స్వదేశీ సంత
చక్రస్నానంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు